రండి.. వరద బాధితులను ఆదుకుందాం : నాట్స్ పిలుపు
తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వరదలు లక్షల మంది జీవితాలను ముంచేశాయి. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు మానవత్వంతో స్పందించి ముందుకు రావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పిలుపునిచ్చింది. విజయవాడ, ఖమ్మం, నల్గొండ, గుంటూరు తదితర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు చేతనైన సాయం చేసేందుకు అమెరికాలో ఉండే ప్రతి ఒక్క తెలుగు కుటుంబం స్పందించాలని కోరింది. సాటి తెలుగువారు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాట్స్ పేర్కొంది. వరద బాధితుల కోసం నాట్స్ వెబ్సైట్ మరియు గో ఫండ్ ద్వారా నాట్స్ విరాళాల సేకరణకు నడుంబిగించింది. ప్రతి ఒక్కరూ తాము చేయగలిగిన సాయాన్ని విరాళంగా అందించాలని కోరింది.
https://www.natsworld.org/nats-global/s/support-flood-victims-in-andhra-pradesh-telangana?sid=188
Or