చికాగోలో తెలుగు కుటుంబాలకు నాట్స్ దీపావళి కానుకలు
అమెరికాలో తెలుగుజాతి కోసం పని చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దీపావళి సందర్భంగా చికాగోలో ఉంటున్న తెలుగు కుటుంబాలకు దీపావళి కానుకలు పంపిణి చేసింది. చికాగోలో దాదాపు 300 తెలుగు కుటుంబాలకు నాట్స్ చికాగో విభాగం సభ్యులు ఇంటింటికి వెళ్లి దీపావళి కానుకలు అందించారు. దీపావళి పండుగనాడు ప్రతి ఇంట సంతోషం నిండాలనే ఆకాంక్షతో నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ చాప్టర్ నాయకులు హరీష్ జమ్ముల, బిందు వీధులమూడి, వీర తక్కెళ్లపాటి, నరేంద్ర కడియాల, మనోహర్ పాములపాటి, అంజయ్య వేలూరు, వినోద్, సునీల్ ఆకులూరి, భారతి పుట్ట, రోజా శీలంశెట్టి, నరేష్ యాద తదితరులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మూర్తి కొప్పాడ, శ్రీని అరసడ, శ్రీని బొప్పన, రవి శ్రీకాకుళంతో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె.బాలినేని, లక్ష్మి బొజ్జలు ఈ కార్యక్రమానికి చక్కటి మార్గదర్శకత్వం చేశారు. దీపావళి కానుకలు అందించేందుకు నాట్స్ సభ్యులు విరాళాలు అందించడంతో పాటు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటింటికి దీపావళి కానుకలు పంపిణి చేయడంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. చికాగో నాట్స్ చాప్టర్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి నాట్స్ చికాగో విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.