నాట్స్ ఆధ్వర్యంలో బాలల సంబరాలకు ముహూర్తం ఫిక్స్

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో 13వ సారి బాలల సంబరాలకు ముహూర్తం ఖరారైంది. నెహ్రూ జయంతి సందర్భంగా నవంబరు 18న శనివారం నాడు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులకు డ్యాన్స్, పాటలు, చెస్, మ్యాథ్స్ ఛాలెంజ్, తెలుగు పదసంపద, తెలుగు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. చెస్ పోటీల్లో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు నాట్స్ సభ్యులైతే 20 డాలర్లు, సభ్యులు కాకుంటే 25 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా పోటీల్లో పాల్గొనాలంటే నాట్స్ సభ్యులు 10 డాలర్లు, సభ్యులు కాని వారు 15 డాలర్ల ఫీజు చెల్లించాలి. ఈ సంబరాలు నవంబరు 18న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. టెక్సాస్‌లోని సెయింట్ మేరీస్ ఆర్థడాక్స్ చర్చ్‌లో ఈ వేడుకల కోసం ఏర్పాట్లు చేయనున్నారు. పోటీల్లో రిజిస్టర్ చేసుకోవాలని అనుకునే వారు www.natsworld.org/dallas-balalasambaralu2023 లింకులో దరఖాస్తు చేసుకోవచ్చు.






