కాలిఫోర్నియాలో బాలల సంబరాలకు ముహూర్తం ఫిక్స్
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో కాలిఫోర్నియా వేదికగా బాలల సంబరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు ఈ సంబరాలు నిర్వహించనున్నారు. లాంగ్ బీచ్‌లోని కాబ్రిలో హై స్కూల్‌లో జరిగే ఈ బాలల సంబరాల్లో ఎంట్రీ ఉచితం. డిన్నర్ ఏర్పాట్లు కూడా ఇక్కడే ఉంటాయని నాట్స్ వెల్లడించింది. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారుల క్లాసికల్ డ్యాన్స్, ఫ్యాషన్ షో, ఫోక్ డ్యాన్స్, ఫిల్మ్ డ్యాన్స్ స్పోర్ట్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తెలుగు వారంతా హాజరై విజయవంతం చేయాలని నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌వుమెన్ అరుణ గంటి, కార్యనిర్వాహక వర్గం సభ్యులు కోరుతున్నారు.
Tags :