ASBL Koncept Ambience
facebook whatsapp X

యంగ్ హీరోలు ఎలాంటి ర‌చ్చ చేస్తారో?

యంగ్ హీరోలు ఎలాంటి ర‌చ్చ చేస్తారో?

బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) కెరీర్ స్టార్టింగ్ నుంచి పెద్ద బ‌డ్జెట్ తో స్టార్ డైరెక్ట‌ర్లు, స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు త‌ప్పించి ఇప్ప‌టివ‌ర‌కు సాలిడ్ హిట్ కొట్టి అనుకున్న రేంజ్ కు మాత్రం చేరుకోలేక‌పోయాడు. దానికి తోడు మ‌ధ్య‌లో ఛ‌త్ర‌ప‌తి(Chatrapathi)ని హిందీలో రీమేక్ చేసి మూడేళ్లు టైమ్ వేస్ట్ చేసుకున్నాడు.

ఆ గ్యాప్ ను క‌వర్ చేయాల‌ని ఇప్పుడు వ‌రుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీను. భీమ్లా నాయ‌క్(Bheemla Nayak) ఫేమ్ సాగ‌ర్ చంద్ర(Sagar chandra) ద‌ర్శ‌క‌త్వంలో టైస‌న్ నాయుడు(Tyson Naidu) సినిమా చేస్తున్న శ్రీనివాస్, తాజాగా భైర‌వం(Bhairavam) అనే ఓ మాస్ సినిమాను అనౌన్స్ చేశాడు. నాంది(Nandhi) సినిమాతో డైరెక్ట‌ర్ గా మొద‌టి సినిమాతో త‌న‌దైన ముద్ర వేసుకున్న విజ‌య్ క‌న‌క‌మేడ‌ల(Vijay Kanakamedala) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్(Sri Satyasai Arts) బ్యాన‌ర్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టైటిల్ ప‌వ‌ర్‌ఫుల్ గానే క‌నిపిస్తున్నాయి. ఈ సినిమాలో నారా రోహిత్(Nara Rohit), మంచు మ‌నోజ్(Manchu Manoj) కూడా ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ కాంబినేష‌న్ విన‌డానికే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఆన్ స్క్రీన్ పై ఈ ముగ్గురు యంగ్ హీరోలు చేసే ర‌చ్చ ఏ రేంజ్ లో ఆస‌క్తి క‌లిగిస్తుందోన‌నే కుతూహ‌లం అంద‌రిలోనూ క‌లుగుతోంది. శ్రీ చ‌ర‌ణ్ పాకాల(Sri Charan Pakala) సంగీతం అందిస్తున్న ఈ సినిమా శ్రీనివాస్ కు ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.  

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :