ఆంధ్ర, తెలంగాణకు నారా భువనేశ్వరి రూ.2 కోట్ల విరాళం
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి రూ.రెండు కోట్ల విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఆంధ్ర, తెలంగాణలను అతలాకుతలం చేశాయి. సహాయ చర్యలు, వరద ప్రనభావిత ప్రాంతాల పునర్నిర్మాణంలో ఆయా రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవడాన్ని బాధ్యతగా భావిస్తున్నా అని భువనేశ్వరి పేర్కొన్నారు.
Tags :