Radha Spaces ASBL

వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే 21.00 కోట్ల షేర్! అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిన దసరా..

వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే 21.00 కోట్ల షేర్! అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిన దసరా..

నాచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల  దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. మంచి అంచనాల నడుమ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన అన్ని చోట్లా అద్బుతమైన వసూళ్లను అందుకుంటూ అదరగొడుతోంది. సినిమా నాని కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అంతేకాదు ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్ ని దాటింది.. ఇక లేటెస్ట్‌గా వన్ మిలియన్‌ను క్రాస్ చేసింది దసరా మొదటి రోజు తెలంగాణ ఏరియా  బాక్స్ ఆఫీస్ దగ్గర 14 కోట్ల మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా 21 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కేక పెట్టించింది.

ఏరియాల వారిగా చూస్తే.. నైజాం: 6.78 కోట్లు, సీడెడ్: 2.36కోట్లు, ఉత్తరాంధ్ర : 1.42కోట్లు, తూర్పు: 90లక్షలు, పశ్చిమ: 55 లక్షలు, గుంటూరు: 1.22 కోట్లు, కృష్ణ: 64 లక్షలు, నెల్లూరు: 35లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం: 14.22 కోట్ల షేర్.. 24.85 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్నాటక అండ్ రెస్టాఫ్ ఇండియా : 1.52 కోట్లు, ఇతర భాషలు : 71 లక్షలు, ఉత్తర భారతదేశం : 35 లక్షలు, ఓవర్సీ్స్ : 4.20 కోట్లు వచ్చింది ఇక టోటల్ వరల్డ్ వైడ్‌గా 21.00 కోట్ల షేర్ రాగా.. 38.40 గ్రాస్ వచ్చింది. ఇక ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కాకుండా 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం ఇంకా 28 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకోవాలి.  పాటలు, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అదిరిపోయిందని..సినిమా రివ్యూస్ ఎక్కడ నెగటివ్ గా రాయకపోవడం 3 ప్లస్ రేటింగ్ ఇవ్వడం సినిమా రన్ కి దోహదపడ్డాయి. ముఖ్యంగా ఇంటర్వెల్  బ్లాక్ కేక పెట్టించిదని..ఇంత వరకు తెలుగులో అలాంటీ ఎపిసోడ్ చూడలేదని అంటున్నారు. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది. గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ రా అండ్ ర‌స్టిక్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందని అంటున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :