రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.. పరిపాలన మొత్తం వారి చేతుల్లో : బాలకృష్ణ
టీడీపీ, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఇన్ని సీట్లు, అన్ని సీట్లు కాదు టీడీపీ-జనసేన గెలవాలి. నేను, పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతాం. ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యం. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్థులు, హంతకుల చేతుల్లో ఉంది. పరిపాలన ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలి. రాష్ట్రంలో ఒక్క హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం. పరిపాలన చేతకాగా 3 రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
Tags :