మామంచి బాలయ్య! 15 కోట్ల పారితోషకం... క్యాన్సర్‌ హాస్పిటల్‌ కు విరాళం  

మామంచి బాలయ్య! 15 కోట్ల పారితోషకం... క్యాన్సర్‌ హాస్పిటల్‌ కు విరాళం  

ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించిన  బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్ హాస్పిటల్‌ ద్వారా నందమూరి బాలకృష్ణ ఎంతోమంది పేదలకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఆసరాగా ఉంటూ తన మంచి మనసు చాటుకుంటున్నారు బాలయ్య. బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్ హాస్పిటల్‌ ద్వారా నందమూరి బాలకృష్ణ ఎంతోమంది పేదలకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఆసరాగా ఉంటూ తన మంచి మనసు చాటుకుంటున్నారు బాలయ్య. స్టార్ హీరోలంతా సినిమాలతోనే కాకుండా.. కమర్షియల్ యాడ్స్‌తో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలే కాకుండా.. వెంకటేష్, నాగార్జున, చిరంజీవిలు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించారు.

కానీ బాలయ్య మాత్రం ఇన్నేళ్ల తన సినీ కెరియర్‌లో ఇప్పటి వరకూ ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించలేదు. కానీ తొలిసారి బాలయ్య ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. లీడింగ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సాయిప్రియ గ్రూప్‌‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు బాలకృష్ణ . రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ '116 పారమౌంట్'  వారి యాడ్‌లో నటించారు బాలకృష్ణ. సినిమాటిక్‌ స్టైల్‌లో '116 పారామౌంట్‌' వెంచర్‌‌ను ప్రమోట్‌ చేస్తూ.. తన దైనశైలిలో డైలాగ్‌లు చెప్తూ అలరించారు బాలయ్య. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. అయితే ఫస్ట్ యాడ్ ద్వారా బాలయ్య అందుకున్న తొలి పారితోషికం అక్షరాలా రూ.15 కోట్లు. అయితే ఈ భారీ పారితోషికం మొత్తాన్ని.. ‘బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్ హాస్పిటల్‌’కి దానం చేశారు బాలయ్య. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన బాలయ్య.. ఈ యాడ్‌ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ను క్యాన్సర్‌ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. బాలయ్య గొప్ప మనసుకు నందమూరి అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అవుతూ ‘జై బాలయ్య’ అని జై కొడుతున్నారు.

అయితే బాలయ్య రూ.15 కోట్ల దానానికి సంబంధించిన అప్డేట్‌ని ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేస్ దేవి నాగవళ్లి తన ఫేస్ బుక్‌లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్‌ ఎంటర్‌టైనర్ వీరసింహా రెడ్డి రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సంక్రాంతి బరిలో ‘వీర సింహారెడ్డి’ బాక్సాఫీస్‌ని షేక్ చేయబోతున్నాడు. దీంతో పాటు.. అనిల్‌ రావిపూడి సినిమాను సైతం లైన్‌లో పెట్టాడు బాలయ్య. అటు సినిమాలు చేస్తూ..ఇటు ‘అన్ స్టాపబుల్’ అంటూ ‘ఆహా’లో అదరగొడుతున్నాడు బాలయ్య.

https://www.facebook.com/watch/?v=650743156424805

 

Tags :