'రామారావు ఆన్ డ్యూటీ' లో ఐటమ్స్ సాంగ్ "నా పేరు సీసా"...

'రామారావు ఆన్ డ్యూటీ' లో ఐటమ్స్ సాంగ్ "నా పేరు సీసా"...

ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' థర్డ్ సింగల్ 'నాపేరు సీసా' పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్ సీసా (సీకాకులం సారంగీ)గా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ పాటలో ట్రెడిషనల్ వేర్ లో కనిపించిన రవితేజ సరసన ఉల్లాసంగా ఆడిపాడింది అన్వేషి. థియేటర్ లో మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా వుంది 'నా పేరు సీసా'.

సామ్ సిఎస్ మాస్ ఈ పాటని డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేయగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంది.
♫నా పేరు సీసా
ఒకరికినే తేనె సీసా
ఒకరికినే కల్లు సీసా
ఒకరికినే  మసాలా సీసా
ఇంకొకరికి రసాల సీసా
అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా♫

పాట పల్లవిలో వినిపించిన ఈ లిరిక్స్ క్యాచిగా ఆకట్టుకున్నాయి. శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్ గా ఈ పాటని ఆలపించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

 

 

Tags :