లేని పోని ప్రయత్నాలు చేస్తున్న మైత్రీ బ్యానర్
టాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు తో తమ జర్నీని స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ బ్యానర్‌గా కొనసాగుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే భారీ ప్రాజెక్టులను చేసుకుంటూ వచ్చిన మైత్రీ బ్యానర్ మంచి విజయాలతో పాటూ భారీ లాభాలను కూడా మూటగట్టుకున్నారు.
రీసెంట్ గా మైత్రీ నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలను రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఎంత లక్ ఉన్నా సరే ఇండస్ట్రీలో ఎదురుదెబ్బలు తగలడం షరా మామూలే. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ అలాంటి ఎదురుదెబ్బలే ఎదుర్కొంటోంది.
అనవసరమైన ఎక్స్‌పెరిమెంట్లు చేసి ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరును పొగొట్టుకుంటుంది ఈ బ్యానర్. పేరు పోవడంతో పాటు కావాల్సినంత నష్టాలను కూడా ఈ బ్యానర్ భరిస్తోంది. అమిగోస్ తో భారీ నష్టాలను చవిచూసిన మైత్రీ బ్యానర్, ఆ తర్వాత మీటర్ సినిమాను రిలీజ్ చేసి నష్టాలను ఎదుర్కొంది. రీసెంట్ గా సత్తిగాని రెండెకరాలు అనే టైటిల్ తో ఓ సినిమాను నిర్మించి, ఆహాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా కూడా మంచి టాక్ ను రాబట్టుకోలేదు. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తే మైత్రీ బ్యానర్ కి ఉన్న పేరు మరింత పాడయ్యే ఛాన్సుంది.