ASBL NSL Infratech
facebook whatsapp X

రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి బంగ్లాదేశ్...?

రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి బంగ్లాదేశ్...?

బంగ్లాదేశ్ వాసుల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్లైంది. ఇన్నాళ్లూ అభివృద్ధే లక్ష్యంగా హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపారు షేక్ హసీనా. వ్యతిరేకించిన వారిని జైళ్లలోకి పంపారు. దీంతో వారందరూ సైలంట్ అయ్యారు. ఎప్పుడైతే హసీనా ప్రభుత్వం పడిపోవడం, ఆమె భారత్ లో తలదాచుకోవడం ప్రారంభమైందో... వారందరూ ఇప్పుడు తమ సత్తా చూపిస్తున్నారు. జైళ్లలో ఉన్న వారిని విడుదల చేసి, వారికి క్లీన్ చిట్ ఇచ్చి మరీ అక్కడి ప్రభుత్వం.. వారితో ములాఖత్ లు నిర్వహిస్తోంది.

ఈపరిణామంపై సహజంగానే ఇండియాలో ఆందోళన వెల్లువెత్తుతోంది. బంగ్లాదేశ్ క్రమక్రమంగా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని షేక్ హసీనా నిషేధించిన ‘‘జమాతే ఇస్లామీ’’ సంస్థకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ క్లీన్‌చిట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, తాజాగా హెఫాజత్-ఏ ఇస్లాం సంస్థ నాయకుడు మమునుల్ హక్, అతడి గ్రూపు సభ్యులతో కలిసి మహ్మద్ యూనస్ భేటీ కావడం వివాదాస్పదమైంది.

మరోవైపు....శనివారం మహ్మద్ యూనస్, హెఫాజత్-ఏ ఇస్లాం నాయకులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సమావేశం భారత ఆందోళనకు కారణమైంది. షేక్ హసీనా హాయాంలో మమునుల్ హక్‌ హింసను ప్రేరేపించడంతో పాటు పలు ఆరోపణల కింద అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ ప్రగతి శీల అంశాలను వ్యతిరేకిస్తున్న హెఫాజత్ ఏ ఇస్లాం, మత ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తోంది.

2010లో ఏర్పడిన ఈ సంస్థ ఇస్లామిక్ చట్టాలను సమర్థిస్తోంది. రాజ్యాంగ సూత్రాలను, లౌకికవాదాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటీవల, తాత్కాలిక ప్రభుత్వం అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) చీఫ్ జషీముద్దీన్ రహ్మానీని విడుదల చేసింది. స్లీపర్ సెల్‌ల సాయంతో జిహాదీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తీవ్రవాద బృందం ప్రయత్నిస్తున్నందున ఇతడి విడుదల భారతదేశానికి ఆందోళన కలిగించే విషయంగా మారింది..

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :