ASBL NSL Infratech
facebook whatsapp X

'మిస్టర్ బచ్చన్' 14వ తారీకు సాయంత్రం నుంచి ఇరగదీయబోతోంది : రవితేజ  

'మిస్టర్ బచ్చన్' 14వ తారీకు సాయంత్రం నుంచి ఇరగదీయబోతోంది : రవితేజ  

మిస్టర్ బచ్చన్ రిపీట్ ఆడియన్స్ వుండే సినిమా. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: డైరెక్టర్ హరీష్ శంకర్  

మిస్టర్ బచ్చన్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా సూపర్ సక్సెస్ అవుతుంది: నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఆగస్ట్ 14 సాయంత్రం నుంచి ప్రిమియర్స్ వుండబోతున్నాయి.  ఈ నేపధ్యంలో కర్నూల్ లో మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ.. హాయ్ కర్నూల్. హలో తమ్ముళ్ళు. ఈ ఈవెంట్ కి విచ్చేసిన టిజి వెంకటేష్  గారికి, పార్ధసారధి గారికి థాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంత కలర్ ఫుల్ గా వుండబోతోంది. ఈ సినిమాలో నేను, భాగ్యశ్రీ అందంగా కనిపించబోతున్నాం. ఈ క్రెడిట్ మా డీవోపీ ఆయంక బోస్ కి దక్కుతుంది. మా డ్యాన్స్ మాస్టర్ భాను సాంగ్స్ ఇరగదీశాడు. కాసర్ల శ్యాం, భాస్కర భట్ల, సాహితి గారు చాలా మంచి పాటలు రాశారు. పృద్వీ ఇందులో మూడు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు. మీకు తెగ నచ్చుతాయి. గిరి,ప్రవీణ్,సత్య యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. మిక్కీ జే మేయర్ నుంచి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఒకరకంగా షాక్ ఇచ్చినట్లే. ఫస్ట్ టైం ట్యూన్స్ వినిపించినపుడు ఇది మిక్కీనా అనిపించింది. తనకి బిగ్ కంగ్రాజ్యులేషన్. విశ్వ గారు, వివేక్ గారు బాగా దగ్గర. వారు ఇలాంటి సినిమాలు తీస్తూనే వుండాలి, బ్లాక్ బస్టర్స్ కొడుతూనే వుండాలి. భాగ్యశ్రీ ఇప్పటికే ఊపు ఊపేస్తుంది. తనే డబ్బింగ్ చెప్పింది. సినిమాలో మీ అందరికీ ఇంకా నచ్చుతుంది. తనకి బ్రైట్ ఫ్యూచర్ వుండాలి. థాంక్ యూ సో మచ్ హరీష్. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయి నెక్స్ట్ హ్యాట్రిక్ కి దారి తీయాలి. హరీష్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అన్ని శాఖలు ప్రోపర్ గా చూసుకుంటాడు, మిస్టర్ బచ్చన్ 14వ తారీకు సాయంత్రం నుంచి ఇరగదీయబోతోంది. ఆల్రెడీ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ఈవెంట్ జరగడానికి సహకరించిన పోలీసు శాఖ వారికి, అందరికీ థాంక్ యూ. జై సినిమా' అన్నారు.
       
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ చూస్తుంటే కత్తిలాంటి కుర్రాళ్ళు కర్నూల్ లోనే వున్నారా అనిపిస్తుంది. ఈ ఈవెంట్ జరగడానికి సహకరించిన పోలీసు శాఖకి థాంక్ యూ. ఈ ఈవెంట్ కి విచ్చేసిన టిజి వెంకటేష్  గారికి, పార్ధసారధి గారికి అందరికీ కృతజ్ఞతలు. నా రైటింగ్ టీం థాంక్ యూ. భాస్కర్ బట్ల,వనమాలి, కాసర్ల శ్యాం, సాహితి గారికి థాంక్ యూ. ఈ సినిమాకి ప్రవీణ్ వర్మ అద్భుతమైన డైలాగులు రాశారు. ఆగస్ట్ 14 నుంచే మిస్టర్ బచ్చన్ ప్రిమియర్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆన్ లైన్ లో బుకింగ్ స్టార్ట్ అయింది. అందరూ బుక్ చేయండి. ఆగస్ట్ 15 మా గురువు గారు పూరి జగన్నాథ్ గారు, రామ్ డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. ఈ రెండు సినిమాలు చూడండి. రెండు సినిమాలని బ్లాక్ బస్టర్ చేయండి. మైత్రీ వారికి, శిరీష్ గారికి థాంక్ యూ. ఫస్ట్ టైం నా కెరీర్ లో  నేను అడిగినదాని కంటే అన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. అందుకే ఈ సినిమాని అంత ఫాస్ట్ గా చేయగలిగాం. చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్. వారి నిర్మాణంలో సినిమాలు చేస్తూనే వుంటాను. డీవోపీ బోస్ లేకుండా నా సినిమా ఫ్రేం నమి ఊహించలేను. తనతో ఇది నా నాలుగో సినిమా. భాగ్యశ్రీ హార్డ్ వర్కింగ్ హీరోయిన్. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది. నా కో డైరెక్టర్ బాబీ ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డారు. నా డైరెక్షన్ టీం ఒక ఆర్మీలా పని చేసింది. మేకప్ ఛీప్ శ్రీను ఆల్ రౌండర్. తను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా అయ్యేది కాదు. మిరపకాయ్ టైటిల్ రవితేజ గారే పెట్టారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టింది కూడా ఆయనే. జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చారు (నవ్వుతూ). మై ఓన్లీ హోప్ మాస్ మహారాజ రవితేజ. నేను ఈ స్టేజ్ మీద నిల్చోవడానికి కారణం రవితేజ గారు. డైరెక్టర్ గా 'షాక్' తో జన్మనిచ్చి మిరపకాయ్ తో పునర్జన్మనిచ్చారు. ఆయన లేకుండా నా ఫిల్మ్ కెరీర్ ని ఊహించలేను. వన్ మంత్ లో నాలుగు చార్ట్ బస్టర్ సాంగ్స్ చేశారు మిక్కీ జే మేయర్. మా ఇద్దరిదీ డెడ్లీ కాంబినేషన్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ సో మచ్. మిస్టర్ బచ్చన్ రిపీట్ ఆడియన్స్ వుండే సినిమా.'అన్నారు.  

టిజి వెంకటేష్ మాట్లాడుతూ.. మా టి.జి.విశ్వ ప్రసాద్, మా కర్నూల్ అబ్బాయి టి.జి.విశ్వ ప్రసాద్ విశ్వ విఖ్యాతి సినిమాల ద్వారా ప్రపంచమంతా ఖ్యాతి పొందుతున్నాడు. కర్నూల్ మీద వున్న ప్రేమ అభిమానంతో ఈ వేడుక ఇక్కడ నిర్వహించడం ఆనందంగా వుంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాత బాడీలో బ్లడ్ లాంటి వారు. బ్లడ్ సరఫరా బావుంటేనే బాడీ పని చేస్తుంది. నిర్మాత విశ్వప్రసాద్ బాడీలో బ్లడ్ మాదిరిగా పని చేస్తూ చక్కని సినిమాలని నిర్మిస్తున్నారు. దేశంలో ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయడం అభినందనీయం. రవితేజ గారి శంభో శివ శంభో సినిమా మాఇంట్లోనే షూటింగ్ జరుపుకుంది. అప్పుడు రవి గారు మా ఇంట్లోనే వున్నారు. రవి (సూర్యుడు)లానే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్నారు. హరీష్ శంకర్ అందరివాడిలా వుంటున్నారు. అలాగే ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆశీర్వాదిస్తున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. గుడ్ లక్ ఎవ్రీ బడీ' అన్నారు.    

ప్రొడ్యూసర్ టి.జి.విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మూడోసారి కలసి పని చేసే అవకాశం ఇచ్చిన రవితేజ గారికి థాంక్ యూ వెరీ మచ్. హరీష్ శంకర్ తను చేస్తున్న సినిమా నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకొని ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి థాంక్ యూ. మిస్టర్ బచ్చన్ ఇప్పటివరకూ చూసిన పాటలే కాకుండా ఇంకా ఎక్స్ట్రా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 14 ప్రిమియర్ షోస్ అందరూ చూస్తారని కోరుతున్నాను. థాంక్ యూ' అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.ఆర్.కె.రాజు మాట్లాడుతూ.. హలో కర్నూల్. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. ఆగస్ట్ 15న మిమ్మల్ని అలరిస్తామని నమ్ముతున్నాం. బోస్, మిక్కీ గారు కలసి విజువల్ అండ్ మ్యూజికల్ వండర్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. రవితేజ గారితో పని చేసిన ప్రతి క్షణం చాలా స్ఫూర్తి పొందాను. ఈ వేదికపై నిలబడి మాట్లాడేలా చేసిన నా ఫ్రెండ్ హరీష్ శంకర్ కి టేక్ ఏ బౌ. ఆగస్ట్ 15 దేశానికి జెండా పండగ. మనకి మిస్టర్ బచ్చన్ పండగ' అన్నారు    

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. మూవీ రిలీజ్ కి ముందే మీరంతా ఎంతో ప్రేమని చూపించారు. అందరికీ థాంక్ యు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో ఇంత మంచి రోల్ ఇచ్చిన హరీష్ గారికి థాంక్ యూ. మాస్ మహారాజా రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. మాస్ మహారాణిలానే చూశారు. ఆయన నా ఫస్ట్ కో స్టార్ కావడం చాలా ఆనందంగా వుంది. నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్స్. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి' అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ట్యాలెంట్ ని గుర్తించి అవకాశాలు ఇవ్వడంతో రవితేజ గారు ఎప్పుడూ ముందుటారు. అలా మిరపకాయ్ లాంటి డైరక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారాయన. హరీష్ గారు ఈ సినిమాని పెద్ద హిట్ చేసి గురు దక్షణ తీర్చుకుంటారని అనుకుంటున్నాను.  సపోర్ట్ చేసిన టీం అందరికీ థాంక్స్. మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 14న తేది సాయంత్రం అన్ని సిటీల్లో పెయిడ్ ప్రిమియర్స్ వుంటాయి. ఆగస్ట్ 15 రిలీజ్ వుంటుంది. మీరంతా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు.

రైటర్ బివిఎస్ రవి మాట్లాడుతూ.. మిస్టర్ బచ్చన్ సినిమా అదిరిపోయింది. ఈ కాంబో ఎక్స్ ట్రార్డినరీ బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది. కర్నూల్ వాసి అయిన విశ్వ ప్రసాద్ గారు మనందరికీ గౌరవం తెస్తారు. మిక్కీ జే మేయర్ గొప్ప పాటలు ఇచ్చారు. అద్భుతమైన పాటలు, డ్యాన్సులు, యాక్షన్, మాస్ మహారాజ నాన్ స్టాప్ ఎనర్జీ తో ఈ సినిమా అవస్తోంది. హరీష్ శంకర్ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలా ఉంటాడు. భాగ్యశ్రీ ఈ సినిమాతో సిగ్నేచర్ హీరోయిన్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. రవితేజ లాంటి హీరో కావాలంటే నిరంతరం పని చేయాలి. రవితేజ ఎనర్జీ ట్రాన్స్ ఫార్మర్. ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్ సక్సెస్ సంబరాల్లో అందరం పాలుపంచుకుందాం' అన్నారు.  

ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. మా అధోని విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని నిర్మించడం, ఎంతోమంది యువకులని సినిమా రంగంలో ప్రోత్సహించడం చాలా అనందంగా వుంది. వంద సినిమాలు నిర్మించాలనే ఆయన కల అద్భుతంగా నెరవేరాలని. ఆయన నిర్మించిన ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుంటాను. రవితేజ మా అభిమాన హీరో. ఆయన సినిమాలని కుటుంబం అంతా ఎంతగానో ఎంజాయ్ చేస్తాం. రవితేజ గారు, హరీష్ శంకర్ గారు ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను' అన్నారు

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ..  మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరగడం చాలా ఆనందంగా వుంది. రవితేజ గారికి సినిమా యూనిట్ అందరికీ ధన్యవాదాలు. కర్నూల్ లో ఈవెంట్ జరుపుకున్న ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ .. హలో కర్నూల్. ముందుగా రవితేజ సర్, భాగ్యశ్రీ అమెజింగ్ పెర్ఫార్మెన్స్ కి కంగ్రాట్స్. ఇలాంటి మ్యూజిక్ ని క్రియేట్ చేయడానికి గ్రేట్ ఎనర్జీ ఇచ్చారు. హరీష్ గారితో పని చేయడం ఆనందంగా వుంది. ప్రొడ్యూసర్ విశ్వ గారికి థాంక్ యూ.  హోల్ మ్యూజికల్ టీంకి థాంక్ యూ. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

డీవోపీ అయనంక బోస్ మాట్లాడుతూ.. నాకు హరీష్ బ్రదర్ లాంటి వారు. ఈ సినిమాతో రవితేజ రూపంలో మరో బ్రదర్ దొరికారు. ఆయనతో పని చేసిన ప్రతి క్షణం చాలా ఎంజాయ్ చేశాను. విశ్వం గారు చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. చాలా మంచి సినిమా. ఆడియన్స్ బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారనే నమ్మకం వుంది' అన్నారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ మ్యాసీవ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :