ధర్నాలు, ఆందోళనలు చేస్తే అరెస్టులు అపేస్తారా? : ఎంపీ రఘురామ

వివేకా హత్యకేసు విచారణకు హాజరయ్యే అంశంలో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీ అధికారులకు మరో లేఖ రాయడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో రేపు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందో, లేదో అవినాష్‌కు ఎలా తెలుసని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్‌పై రేపు విచారణ ఉంది. మినహాయింపు కావాలని అవినాష్ సీబీఐకి లేఖ రాశారు. రేపు సుప్రీంలో పిటిషన్ విచారణకు వస్తుందని అనినాష్‌కు తెలుసా? పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రావచ్చు, రాకపోవచ్చు అన్నారు. ఆయన తల్లి అనారోగ్యానికి, అవినాష్ అరెస్టుకు సంబంధం ఏంటి? నిజంగా ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్‌లో మరొకచోట చేర్చాలి కదా. హైదరాబాద్‌లో అయితే వీరికి అన్ని రకాల సహకరాలు అందవనా? ధర్నాలు, ఆందోళనలు చేస్తే అరెస్టులు ఆపేస్తారా? అని ప్రశ్నించారు. కర్నూలులో ఉంటే కడపకు దగ్గరగా ఉంటుందనా నాటకాలు ఆడుతున్నారు. లేక కర్నూలులో మన సీఎం మన పోలీసులనా ఇక్కడ చేర్చింది అని అన్నారు.