గతంలో కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి : ఎంపీ అర్వింద్
గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఒకే తరహా విధానాలు అమలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక వద్ద బీజేపీ చేపట్టిన రైతుదీక్ష ముగింపు సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ దీక్ష రైతుల గోసను కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేసేందుకేనని అన్నారు. ప్రతి జిల్లాకూ ఈ దీక్షలు తీసుకెళ్తామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసింది ప్రధాని మోదీయేనని చెప్పారు. హైడ్రా తీరుపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. పేదల ఇళ్లనే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి జేబులు నింపుకొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags :