అమెరికాలో ప్రధాని మోదీకి ఘనస్వాగత సన్నాహాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 12న అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నారు. జూన్ 18న వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్‌లతో పాటు 20 అమెరికన్ నగరాల్లో భారత సమైక్యతా దినోత్సవ కవాతు జరుపుతామని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ` యూఎస్‌ఏ సంస్థ అధ్యక్షుడు అడపా ప్రసాద్ ప్రకటించారు. జూన్ 21న అమెరికాకు చేరుకునే మోదీకి వైట్‌హౌస్‌లో 22న అధ్యక్ష దంపతులు గౌరవ విందు ఇస్తారు. మోదీ యాత్ర కోసం యావత్ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని అడపా ప్రసాద్ తెలిపారు. జూన్ 21న మోదీ విమానం దిగే ఆండ్రూస్ వైమానిక స్థావరం వద్దకు వెళ్లి స్వాగతం చెప్పడానికి కొందరు భారతీయ అమెరికన్లు సిద్ధమవుతున్నారు. ఆ సాయంత్రం వాషింగ్టన్ డీసీ హోటల్‌కు మోదీ చేరుకోగానే వైట్‌హౌస్ ముందు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నత్వంలో ఏకత్వ ప్రదర్శనలు జరుపుతామని ప్రసాద్ తెలిపారు. 22వ తేదీ ఉదయం వైట్‌హౌస్‌లో 21వ శతఘ్నుల గౌరవాభివందనం మధ్య ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష దంపతులు ఘన స్వాగతం చెబుతారు. ఈ కార్యక్రమానికి 3 వేల నుంచి 5 వేల మంది భారతీయ అమెరికన్లు వైట్‌హౌస్ ఆహ్వానిస్తోంది.