మన దేశంలో ఓ సమస్య ఉంది... న్యూయార్క్ సమావేశంలో రాహుల్

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు భవిష్యత్తు వైపు చూడలేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్ అమెరికా విభాగం న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ అనే కారును ముందుకు చూడకుండా, వెనకవైపు దృశ్యాలను చూపే అద్దాన్ని (రియర్ వ్యూ మిర్రర్) చూస్తూ నడిపేందుకు యత్నిస్తున్నారని, ఆ తీరు ఒకదాని తర్వాత మరో ప్రమాదానికి దారితీస్తోందని మండిపడ్డారు. మన దేశంలో ఓ సమస్య ఉంది. ఆ సమస్యను మీకు చెబుతాను. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు భవిష్యత్తును చూడలేవు. వారికి ఆ సామర్థ్యం లేదు. మీరు ఏ విషయమైనా ఆడగండి. వారు గతంలోకి తొంగిచూస్తారు అని చెప్పారు. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని మీరు బీజేపీని అడిగితే కాంగ్రెస్ హయాంలోనూ అలాంటి ప్రమాదాలు జరిగాయని చెబుతారంటూ ఒడిశా రైలు ప్రమాదంపై మండిపడ్డారు.
పాఠ్యపుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్‌ను ఎందుకు తొలగించారంటూ మీరు బీజేపీని నిలదీస్దే కాంగ్రెస్ పార్టీ 10సంవత్సరాల క్రితం చేసిన పనిని వారు ప్రస్తావిస్తారని వ్యాఖ్యానించారు. వారి తక్షణ ప్రతిస్పందన ఏమిటంటే గతంలోకి చూడడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం సంభవిస్తే అది బ్రిటిష్ వారి వైఫల్యం. అందుకే రైలు ప్రమాదం సంభవించిందని అప్పటి మంత్రి చెప్పలేదు. రైలు ప్రమాదానికా నాదే బాధ్యత. నేను రాజీనామా చేస్తున్నానని చెప్పారు అని వెల్లడిరచారు.






