ఓటరు పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. ఫైర్ అయిన ఈసీ..
తెనాలిలో పోలింగ్ సమయంలో ఎమ్మెల్యే ఓటరు పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తెనాలి వైసీపీ ఎమ్మెల్యే పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమీషన్ ఆజ్ఞలు కూడా జారీ చేసింది. ఎన్నికల పూర్తయ్యేటంతవరకు అతన్ని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. తెనాలిలో జరుగుతున్న పోలింగ్ బూత్ లో తన ఓటు వేయడానికి వెళ్ళిన ఎమ్మెల్యే శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఒక ఓటరు అతన్ని అడ్డుకున్నాడు. వెంటనే కోపంతో శివకుమార్ ఒకరిపై చేయి చేసుకున్నారు. బాధిత ఓటరు కూడా ఎమ్మెల్యేను తిరిగి కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటర్ పై దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్స్ ఎమ్మెల్యే ప్రవర్తనను తప్పుపడుతున్నారు. ఈ దాడిని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.