ప్రభాస్ సినిమాలో ప్రముఖ నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా అంటే కాస్టింగ్ నుంచి క్రూ వరకు అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు మేకర్స్. ప్రభాస్(Prabhas) ఇప్పుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) లాంటి మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తుండటంతో అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా యూట్యూబర్ ఇమాన్వి ఇస్మాయెల్(Imanvi Ismael) ను ఎంపిక చేయడంతోనే హను(Hanu) తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ముహూర్తం రోజు తనను చూసి అందరూ ఫిదా అయిపోయి హను టేస్టే వేరనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసిన మరో నటుడి విషయంలో కూడా అందరూ వావ్ అంటున్నారు. ఈ మూవీ కోసం హను బాలీవుడ్, బెంగాలీ నటుడైన మిథున్ చక్రవర్తి(Mithun Chakraborthy)ని ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా వెల్లడించింది.
తాజాగా మిథున్ చక్రవర్తి ఎంతో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే(Dada Saheb Falke) అవార్డుకి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభాస్- హను సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ సినిమాలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ తమ సినిమాలోకి ఆహ్వానం పలికింది. ఒకప్పుడు హీరోగా అలరించిన మిథున్ ఇప్పుడు విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. హను ఏరికోరి మిథున్ ను ఎంచుకున్నాడంటే ఆయన కోసం ఏదో స్పెషల్ క్యారెక్టర్‌నే డిజైన్ చేసి ఉంటాడని ఆశించివచ్చు. విశాల్ చంద్రశేఖర్(Vishal Chandra Sekhar) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.