తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు

తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు

చిత్రసీమలో తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు పైడి జయరాజ్‌ అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. పైడి జయరాజ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కవులను, కళాకారులను, సాహితివేత్తలను, గుర్తించి వారిని గౌరవిస్తున్నారన్నారు. బాలీవుడ్‌లో అగ్ర హీరోగా రాణిస్తూ దర్శకునిగా, నిర్మాతగా,  బాహుభాషా నటుడిగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తరం తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జైరాజ్‌ అన్నారు. జయరాజ్‌ సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కళావేదిక రవీంద్రభారతిలో ఉన్న ప్రివ్యూ థియేటర్‌కి పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ పేరు పెట్టుకొని గౌరవిస్తున్నామన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.