శాస్త్రీయ, సాంకేతికతో వ్యవసాయంతో లాభాలు... ‘కాకతీయ సాండ్ బాక్స్’ సమావేశంలో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి శాస్త్రీయత, సాంకేతికత జోడిస్తే మరెన్నో మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయని, దానికితోడు వచ్చే తరం వ్యవసాయంలో మంచి ఆసక్తిని కనబరుస్తారంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని బోర్గాం వద్ద గల భూమారెడ్డి కన్వెన్షన్ హాలో సాండ్ బాక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఓ మోడల్, దుర దృష్టవశాత్తు ఇండియా ఆ స్థాయిలో టెక్నాలజీ పరంగా అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నారు. ఇలాంటి సమయంలో స్యాండ్ బాక్స్ వంటి సంస్థలు టెక్నాలజీ ఫర్ ఇంప్యాక్ట్ అండ్ స్కేల్ వంటి కార్యక్రమాలతో సాంకేతికతను ప్రజలకు ఉపయోగపడే రీతిలో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం హర్షణీయమని కొనియాడారు. టెక్నాలజీతో వినూత్న రీతిలో ముందు కెళ్తున్న కాకతీయ స్వాండ్ బాక్స్ సంస్థకు ఇతర స్టార్టప్ సంస్థలకు అభినందనలు తెలిపారు.
కాకతీయ సాండ్ బాక్స్ వారు కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. మంత్రి కేటీఆర్ సంస్థ వారితో మాట్లాడిన అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. రైతుల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం వెలుగు నింపుతోందన్నారు. కరోనా లాంటి కష్ట సమయంలో అందరూ తల్లడిల్లుతుంటే రైతులకు ఇబ్బంది కాకుండా ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంపొంది ఎస్సారెస్పీ లాంటి ప్రాజెక్టకు పునరుజ్జివనం పోశామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం మేలు చేసే విధంగా 24 గంటల విద్యుత్తు, నీరు, పంట పొలాలకు అంధించే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. ఆ నీటిద్వారానే రైతులకు, పంట పొలాలకు అవసరమైనంత మేరకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. పట్టణాలలో నగరాలలో తాగునీటికి 30 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాటు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు రైతుబంధు, రైతు బీమా, 5000 ఎకరాలకు ఒక క్లస్టర్, క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించి రైతులకు చేరువై విధంగా మేలు చేసారని అన్నారు. ఆనాడు రైతులు పంట పండిరచడానికి పుట్టెదు దుఖముతో ఉండే వారని, ఇప్పుడు అధికంగా పంట పండిస్తున్నారన్నారు. పంటలు పండిరచుటకు 2014లో తెలంగాణ రాష్ట్రం నుండి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ జరిగిందని, ప్రస్తుతం 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిరచడం పై సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని 26వ స్థానం నుండి మూడో స్థానం రావడం తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేస్తున్న ప్రోత్సహామే కారణమని అన్నారు. ఇంతటి వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి వ్యవసాయనికి శాస్త్రీయత, సాంకేతికత జోడిస్తే ఇంతటి ఫలితాలు వచ్చాయని అన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాదులో త్రిబుల్ ఐటీ సంస్థతో నిర్వహించిన సమావేశంలో జరిగిన అంశాలను తెలుపుతూ రైతుల పిల్లలు రైతులు కావడానికి ఇష్టపడడం లేదు అని వ్యవసాయానికి శాస్త్రీయత సాంకేతికత జోడిస్తే మరెన్నో మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదే విధంగా మన రాష్ట్రంలో వ్యవసాయానికి రైతుకు అనుబంధంగా ఉండే పనులను చేసుకునే 60 నుంచి 60 శాం మంది వరకు ప్రజలు వాటిపైనే ఆధారపడి ఉంటున్నారని ఇందుకు ఐదు రకాల విప్లవాలను వివరించారు. ఒకటి హరిత విప్లవం వ్యవసాయాన్ని విస్తీర్ణం చేస్తూ వంట పొలాలను సాగు చేస్తూ, హరిత విప్లవం, సస్య విప్లవం అని, రెండవది నీలి విప్లవం దీని ద్వారా నీటిని, చెరువులను బాగు చేసుకోవడం నీటితో చేపలు, రొయ్యలు పెంపొందించడం, ఫాం ఫాంట్స్‌లో చేపలు రొయ్యలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దొరికే విధంగా శ్రీరామ్ సారగ్, రాజరాజేశ్వర సాగర్ వంటి నీరు ఉన్న ప్రాంతంలో చేపలు పెంచడం జరుగుతుదని, సిరిసిల్ల జిల్లాలో రాజేశ్వర సాగర్‌లో ఇతర దేశాలకు సంబంధించిన వారు వచ్చి తలపియా అనే చేపను పెంచుటకు 1000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసి 3000 మందికి ఉద్యోగాలను కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీలి విప్లవంలో ఇతర దేశానికి సంబంధించిన ఇంగ్లాండ్ ఫిష్ అనేదానికి మంచి ప్రాముఖ్యత ఉందని గుర్తు చేశారు.
మూడవ విప్లవం గులాబీ విప్లవం ఇది పశు సంపత, జీవ సంపదతో ఎంతో ముడిపడి ఉందని దీని ద్వారా మాంస ఉత్పత్తులు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. గొల్ల, కురుమ, యాదవులకు గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా ప్రజలకు ఉపాధి లభిస్తుందని, మాసం ఉత్పత్తులు పెరిగాయని 11 వేల కోట్లతో ప్రారంభమైన ఈ పశుసంపత, జీవ సంపదతో ఇతర రాష్ట్రాల నుంచి గతంలో మాంసం కొనుగోలు చేసేది. ప్రస్తుతం తెలంగాణ నుండి ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగామని అన్నారు. నాలుగో విప్లవం శ్వేత (వైట్) విప్లవం దీని ద్వారా పాల ఉత్పత్తులు పాల పదార్థాలు అభివృద్ధి చెంది యువకులకు ప్రజలకు మేలు చేకూరుతుందని అందులో భాగంగానే విజయ డేయిరీ నుండి ప్రభుత్వం డివిడెంటని పొందడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొడి, పంట రెండు కలిపి వస్తేనే రైతు ఆదాయం పెంపుతుందని అన్నారు.
ఐదవ విప్లవంయెల్లో (పసుపు విప్లవం ద్వారా పంట నూనెలు ఆయిల్ ఫామ్స్ సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఇతర దేశాల నుండి 78 శాతం దిగుమతి చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడంతో తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు దేశాలకు పామాయిల్ సాగుతోఎ ఇతర ర్ఱాష్టాలకు దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు ఉంటాయని వివరించారు. దానిని ఇతర దేశాలకు పంపించే విధంగా ఎగుమతి చేసే దిశగా ఎదగాలంటే ప్రస్తుతం 20 లక్షల ఎకరాలకు లక్ష్యంగా పెట్టుకొని ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయడం జరుగుతుందని అన్నారు.
కాకతీయ సాండ్ బాక్స్ ద్వారా ఏడెనిమిది జిల్లాలలో 300 గ్రామాల రైతులు బీసీఐ ద్వారా పత్తి పంటను పండించి శాస్త్రీయ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నందుకు అదేవిధంగా ముందుకు వెళ్తున్నందుకు రైతులకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ స్వయానా రైతు మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అందుకని రైతులకు మంచి అవకశాలు కల్పిస్తూ రైతులందరూ అభ్యుదయ రైతులుగా ఎదగాలని, ఆదర్శవంతులు కావాలని అన్నరు. అదేవిధంగా వచ్చే తరం వారికి శాస్త్రీయత, సాంకేతికతతో కూడినటువంటి వ్యవసాయాన్ని ముందు తరాలకు అందించాలంటూ అన్నారు. రానున్న రోజులు వ్యవసాయంలో యువత ముందుండి పని చేసే విధంగా శాస్త్రీయ సాంకేతికలను జోడిరచాలని తెలిపారు. గత మూడున్నరేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ జీఎస్టీపీ వృద్ధి రేటు కూడా అదే స్థాయిలో పెరిగిందన్నారు.
అనంతరం కాకతీయ సాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, జీవన్ రెడ్డి, షకిల్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, కాకతీయ సాండ్ బాక్స్ సీఈవో మనీష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక వ్యవసాయానికి మద్దతు ఇస్తున్న ‘కాకతీయ సాండ్ బాక్స్’
గ్రామీణ తెలంగాణపై సానుకూల ప్రభావం చూపుతూ సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ‘‘కాకతీయ సాండ్ బాక్స్’’. సరికొత్త ఆలోచనలపై పరిశోధనలు జరిపి, ఆచరణ యోగ్యమైన విధానాలను ఎంచుకోవడం ఈ సంస్థ లక్ష్యం. ప్రజలపై సానుకూల ప్రభావం చూపే ఆలోచనలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. వాటిని మరింత అభివృద్ధి చేసి, ఎక్కువమంది ప్రజలకు ఈ ఫలాలు చేరేలా చేయడం సాండ్ బాక్స్ ప్రత్యేకత. నిజామాబాద్ లో ఈ సంస్థ ప్రారంభమై ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త ఆలోచనలకు రూపం ఇచ్చిన సాండ్ బాక్స్.. ఒక లిమ్కా బుక్ రికార్డు, ఒక గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. ఈ సంస్థ ఇచ్చిన ప్లాన్లతో స్థానిక రైతుల ఆదాయం 50 శాతం పెరిగింది. దేశ్ పాండే స్కిల్స్ లో చదివిన విద్యార్థుల ప్లేస్ మెంట్ రేటు 90 శాతం ఉంది. పంటల దిగుబడి 30 శాతం పెంచిందీ సంస్థ. ఇంగ్లీష్ చదువుకునే విద్యార్థుల చదువులో 20 శాతం పెరుగుదల కనిపించింది.
ఐటీ రంగంలో పేరు పొందిన సియెర్రా అట్లాంటిక్ మాజీ సిఇఓ, ఎంట్రప్రెన్యూరర్, సిలికాన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా ఉన్న రాజు రెడ్డి జన్మభూమిపై మమకారంతో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మరింత మెరుగ్గా పంటలను పండిరచుకోవడానికి వీలుగా కాకతీయ సాండ్ బాక్స్‌ను నిర్వహిస్తున్నారు. దేశ్ పాండే ఫౌండేషన్ కు చెందిన హుబ్లీ సాండ్ బాక్స్ స్ఫూర్తితో రాజు రెడ్డి, ఫణీంద్ర సమా ఈ కాకతీయ సాండ్ బాక్స్ ను నడుపుతున్నారు. ఫణీంద్ర సమా రెడ్ బస్ వ్యవస్థాపకుడు. తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ ఇన్నోవేషన్ అధికారిగా పనిచేశారు.
తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల అభివృద్ధి కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, వ్యాపారులు, అకాడమిక్స్ తో కలిసి పని చేస్తూ, స్థానిక యువతలో నాయకత్వ లక్షణాలను నింపి, తమ ప్రాంతంలో అవసరమైన మార్పును తీసుకొచ్చే ఎంట్రప్రెన్యూరర్లుగా వారిని తీర్చిదిద్దుతోంది.






