ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ను రద్దు చేసి వస్తే, ముందస్తుకు మేం సిద్దమని అన్నారు. నిజామాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్దమేనన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని, మనం రూపాయి ఇస్తే, కేంద్రం 46 పైసలే ఇస్తోందని ఆయన మండిపడ్డారు. నేను చెప్పిన లెక్క తప్పయితే రాజీనామాకు సిద్ధం. నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఏం తెచ్చారు? అని ప్రశ్నించారు. జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి జూటో బోర్డు కూడా ఎత్తేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదు. రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థనైనా ఇచ్చారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.







Tags :