ఆ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు మోసపోవద్దు : హరీశ్‌రావు

అమలుకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ తిప్పలు తప్ప అభివృద్ధి ఉండదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు మోసపోవద్దు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఇంతవరకు నెరవర్చలేదు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామా? అని ప్రజలు బాధపడుతున్నారు. రైతుబంధు, రైతుబీమాతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటోంది. రూ.200 ఉన్న పింఛన్‌ను 2 వేలు చేశాం. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 3 వేలు ఇస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.






