ముకేశ్ అంబానీకి భద్రత పెంపు!

ముకేశ్ అంబానీకి భద్రత పెంపు!

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భద్రతను కేంద్ర హోంశాఖ పెంచింది. నిఘా సంస్థలు ఇచ్చిన అంచనా నివేదిక మేరకు ఆయన భద్రతను జడ్‌ కేటగిరి నుంచి జడ్‌ ఫ్లస్‌ కేటగిరికి పెంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇకపై ముకేశ్‌కు 55 మంది సిబ్బందితో భద్రత కల్పించనున్నారు. ఇందులో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఇతర పోలీసు అధికారులు ఉంటారు.  ప్రస్తుతం ముకేశ్‌ అంబానీకి కేంద్రం జడ్‌ కేటగిరి భద్రత కల్పిస్తోంది. అయితే గతేడాది అంబానీ నివాసం సమీపంలో  పేలుడు పదార్థాలతో ఓ వాహనం నిలిపి ఉంచడం కలలకం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత అంబానీ భద్రతపై కేంద్ర నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.