Radha Spaces ASBL

గండిపేట్‌లో 10 ఎకరాల్లో భారీస్థాయిలో నిర్మించిన అల్లు స్టూడియోస్‌ : ప్రారంభించిన మెగా స్టార్ చిరంజీవి

గండిపేట్‌లో 10 ఎకరాల్లో భారీస్థాయిలో నిర్మించిన అల్లు స్టూడియోస్‌ : ప్రారంభించిన మెగా స్టార్ చిరంజీవి

అల్లు రామలింగయ్య ను ఆ కుటుంబం తరతరాలు తలుచుకుంటూనే ఉండాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య  శత జయంతి ఉత్సవాల సందర్భంగా అల్లు స్టూడియోస్  మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా మావయ్య (అల్లు రామలింగయ్య) గారి శత జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. చాలామంది నటులలో చాలా కొద్ది మంది మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుందన్నారు. ఆయన వేసిన బాటలో అల్లు అరవింద్, బన్నీ శిరీష్, బాబీ విజయవంతంగా నడుస్తున్నారని అన్నారు. 'నాడు నటుడిగా ఎదగాలని రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్థగా మారింది. అల్లు వారు తరతరాలు ఆయనను తలుచుకుంటూనే ఉండాలి. ఆయన కుమారుడు అల్లు అరవింద్‌ను నిర్మాతను చేయాలని గీతా ఆర్ట్స్‌ను స్థాపించి ఓ మార్గం చూపించారు.

అల్లు స్టూడియోస్ లాభాపేక్ష కోసం ఏర్పాటు చేయలేదని నేను అనుకుంటున్నా. ఇది లాభాపేక్ష కంటే స్టాటస్ సింబల్. రాబోయే తరతరాలు అల్లు రామలింగయ్యను తలుచుకునేందుకు ఈ స్టూడియోను నిర్మించారని భావిస్తున్నాను. చిరస్థాయిలో ఆయన పేరు నిలబడేలా కృషి చేసిన అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, బాబీలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ కుటుంబంలో భాగం కావడం నేను హ్యాపీగా ఫీలవుతున్నా..' అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్‌తో ముంబైలో ఓ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉన్నందును ముందుగా వెళుతున్నానని.. సాయంత్రం తిరిగి వచ్చి తన మనసులోని మాటను ఇంకా వివరంగా చెబుతానని అన్నారు.

గండిపేట్‌లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్‌ను భారీ స్థాయిలో నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. ప్రపంచ స్థాయి సధుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. మూవీకి సంబంధించి అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాటు చేశారు. షూటింగ్స్‌కు సంబంధించిన బిల్డింగ్‌ పనులు పూర్తవ్వడంతో.. సినిమా చిత్రీకరణకు అందుబాటులోకి వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, సారథి స్టూడియోల తరహాలో అల్లు స్టూడియోస్‌లో కూడా ఇక నుంచి సినిమాల షూటింగ్స్ జరగబోతుంది. గండిపేట్‌లో 10 ఎకరాల్లో భారీస్థాయిలో నిర్మించిన అల్లు స్టూడియోస్‌ ను మెగాస్టార్ చిరంజీవి నేడు ప్రారంభించారు.

మా తాతయ్య జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించామని అల్లు అర్జున్ అన్నారు. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య  శత జయంతి ఉత్సవాల సందర్భంగా అల్లు స్టూడియోస్ మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఆ తరువాత అల్లు రామలింగయ్య గురించి మాట్లాడి.. గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం ముంబై వెళ్లిపోయారు.

అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా కుటుంబం తరుపున ధన్యవాదాలు తెలుతున్నామన్నారు. 'ఇవాళ మా తాత గారు 100వ పుట్టినరోజు. మాకు ఎంతో స్పెషల్. అల్లు అరవింద్ గారికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది.. ల్యాండ్ చాలా ఉంటుంది.. స్టూడియోస్ పెట్టడం విశేషం ఏం కాదని మీరు అనుకోవచ్చు. కానీ మాకేదో ఈ స్టూడియో కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని పెట్టలేదు. ఈ స్టూడియో పెట్టాలనేది మా తాతయ్య గారి కోరిక. మనందరికీ స్టూడియో ఉంటే బాగుండేదని ఆయన అంటుండేవారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించాం. ఇక్కడ ఎన్నో సినిమాల షూటింగ్స్ జరిగి.. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం.

మా తాత గారు మరణించి 18 ఏళ్లు అయినా.. మా నాన్న గారికి ఇంకా ప్రేమ తగ్గడం లేదు. ఏళ్లు గడుస్తున్న కొద్ది ప్రేమ పెరుగుతోంది. ఫంక్షన్ సైజ్ కూడా పెరుగుతోంది. మా ఫాదర్ వాళ్ల ఫాదర్‌ను ఇంతలా ప్రేమించడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. వాళ్లను అంతలా ప్రేమిస్తున్న మా నాన్నకు ధన్యవాదాలు..' అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్‌ను భారీ స్థాయిలో నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. ప్రపంచ స్థాయి సధుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. మూవీకి సంబంధించి అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాటు చేశారు. షూటింగ్స్‌కు సంబంధించిన బిల్డింగ్‌ పనులు పూర్తవ్వడంతో.. సినిమా చిత్రీకరణకు అందుబాటులోకి వచ్చాయి.

 

https://twitter.com/GeethaArts/status/1576088399290593281

https://twitter.com/GeethaArts/status/1576092880493367297

https://twitter.com/GeethaArts/status/1576069233598832640

https://twitter.com/AlluStudios/status/1576077871415668737

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :