కొరటాలను కావాలని టార్గెట్ చేస్తున్నారా?
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న దేవర ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఫుల్ యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు బాగా నచ్చగా మరికొందరి నుంచి ట్రైలర్ విషయంలో మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో కథను ఎక్కువ రివీల్ చేయకుండా ఉండాలని ఇలా కట్ చేశారేమో కానీ ట్రైలర్ కొంతమందికి అయోమయాన్ని కలిగిస్తుంది.
ఎవరికెలా అనిపించినా ట్రైలర్ రిలీజై రోజు తిరక్కుండానే 25 మిలియన్ వ్యూస్ దాటేయడం మామూలు విషయం కాదు. రిలీజ్ కు మరో రెండు వారాల టైముంది కాబట్టి ఈ అంచనాలు ఇంకా పెరగడం ఖాయం. ఇదిలా ఉంటే కొంతమంది కావాలని కొరటాల శివను టార్గెట్ చేస్తున్న వైనం ట్విట్టర్ లో కనిపిస్తోంది. చిరంజీవికి ఆచార్య లాంటి డిజాస్టర్ ను ఇచ్చాడనే కోపంతో కొందరు మెగా ఫ్యాన్స్ కొరటాలను టార్గెట్ చేస్తున్నారు.
అయితే డిజాస్టర్ ఇచ్చిన ఎవరైనా సరే మళ్లీ హిట్ కొట్టరనే గ్యారెంటీ లేదు. కాబట్టి సినిమా చూసేవరకు కొరటాలను ఎన్ని మాటలన్నా ఏం లాభం లేదు. ఒకవేళ దేవర బ్లాక్ బస్టర్ అయితే ఇప్పుడనే మాటలను సదరు వ్యక్తులు ఎలా వెనక్కు తీసుకుంటారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో దేవరపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ అంచనాలను దేవర ఏ మేరకు అందుకుంటాడో చూడాలి.