వరుణ్ సరైన ట్రాక్ లో పడ్డట్టేనా?
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో ప్రయోగాలు చేసిన వరుణ్ తేజ్(Varun Tej) కు గత కొంతకాలంగా వరుస ఫ్లాపులే పడుతున్నాయి. గని(Gani), గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna), ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) ఇలా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లుగా మిగిలాయి. మధ్యలో ఎఫ్3(F3) రూపంలో హిట్ వచ్చినప్పటికీ దాని క్రెడిట్ మొత్తం వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi)కే వెళ్లింది.
దీంతో వరుణ్(Varun) ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పలాస(Palasa) ఫేమ్ కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వంలో వరుణ్ చేస్తున్న మట్కా సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వైజాగ్ లోని ఓ మామూలి కూలీ వాసు తర్వాత వందల కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు? ఈ క్రమంలో అతను ఏం గెలుచుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడనేవన్నీ సినిమాలో చూపించనున్నారు.
ఈ కథను డైరెక్టర్ ప్రెజెంట్ చేసిన విధానం, ఆర్ట్ వర్క్, బడ్జెట్ చూస్తుంటే మట్కా కంటెంట్ ఎంత రిచ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. కథ, స్క్రీన్ప్లే బాగుంటే మట్కా హిట్ అయినట్లే. మట్కా పై నమ్మకం ఏర్పడటానికి ఇది చాలు. లక్కీ భాస్కర్ తో రీసెంట్ గా మంచి హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అదే రోజున సూర్య(Suriya) కంగువ(Kanguva), దేవకీనందన వాసుదేవ(Devaki Nandana Vasudeva) కూడా రిలీజ్ కానున్నాయి. మరి ఈ పోటీలో మట్కా ఏ మేరకు తట్టుకుని నిలబడుతుందో చూడాలి.