ASBL NSL Infratech
facebook whatsapp X

విశ్వక్ సేన్, అనుదీప్ కెవి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ #VS14 అనౌన్స్‌మెంట్

విశ్వక్ సేన్, అనుదీప్ కెవి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ #VS14 అనౌన్స్‌మెంట్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త‌న నెక్స్ట్ లైనప్ సినిమాల‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఈరోజు విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు.

హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌లో ఆదరగొట్టె హీరో విశ్వక్ సేన్, హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో అనుదీప్ కెవి దిట్ట, వీరి కొలాబరేషన్ యూనిక్ స్టొరీ లైన్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కాంబో విశ్వక్ సేన్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని అనుదీప్ కెవి సిగ్నేచర్ హ్యూమర్‌తో బ్లెండ్ చేసి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. 

ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కెవి అనుదీప్‌తో పాటు మోహన్ సతో కథను అందించారు.

#VS14 కి సంబధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేనున్నారు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :