మళయాళ మూవీతో షాక్ ఇచ్చిన మంచు లక్ష్మీ ...

మళయాళ మూవీతో షాక్ ఇచ్చిన మంచు లక్ష్మీ ...

కలెక్షన్ కింగ్ నటవారసురాలు మంచు లక్ష్మి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. నటనలో సైతం విలక్షణమైన పాత్రలు ఎన్నుకొని ప్రేక్షకులకి షాక్ ఇస్తుంటారు. "అనగనగా ఒక ధీరుడు" చిత్రంతో వెండితెరకు పరిచయమైన లక్ష్మి , మొదటి సినిమా లోనే ఐరేంద్రిగా నటించి ఆశర్యపరిచింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె నటనను అంతగా బయటికి రాబట్టిన పాత్రలేవీ దొరకలేదు. దీంతో లక్ష్మి పూర్తిస్థాయిలో తన ప్రతిభను బయటికి తీసుకురాలేకపోయింది. రొటీన్ కథను, పాత్రలు రావడంతో కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉంది.

ఈ నేపథ్యంలోనే "పిట్టకథలు" అంథాలజీ అంశంతో స్వరూపక్కగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తనలోని పూర్తిస్థాయి నటనని చూపించే పాత్రలేవీ ఇంకా లక్ష్మి చేయలేదు. ఈ తరుణంలోనే మలయాళం మూవీ "మాన్ స్టర్" అవకాశం లభించింది. హనీ రోజ్ నటించిన ఈ చిత్రం లో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించింది. మళయాళంలో లక్ష్మి మొదటి సినిమా ఇది, మోహన్ లాల్ సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో మంచు లక్ష్మి హనీ సింగ్ ఇంట్లో పనిమనిషిగా తనతో రేలషన్ లో ఉన్న లెస్బియన్ గా కనిపించబోతుంది. ఒక సీన్ లో ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చాంశనీయంగా మారింది. మన్యం పులి దర్శకుడు వైశాఖ్ ఈ మూవీ ని తెరకెక్కించగా, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకి అక్టోబర్ 12 న వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ మాత్రం డిసెంబర్ 2 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేసారు. క్రైమ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా, మోహన్ లాల్ మునుపటి చిత్రాలకంటే భిన్నంగా ఒక సీరియల్ లాగా అనిపిస్తుంది.

గంటన్నర పాటు ఎలాంటి ఆసక్తి లేకుండా సాగే ఈ సినిమా, మంచు లక్ష్మి కనిపించే లాస్ట్ 30 నిముషాలు మాత్రం ఎగ్జైటింగ్ గా ఉంటుందట. లెస్బియన్ గా తన నటనతో మంచు లక్ష్మి అందరిని షాక్ చేసింది. విలన్ గాను మోహన్ లాల్ తో యాక్షన్ సీన్స్ ని ఈ అమ్మడు ఒక రేంజ్ లో పండించింది. మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. సినిమా మొత్తానికి లక్ష్మి హైలైట్ అవ్వడంతో ఇపుడు ఈ టాపిక్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెట్టింట లక్ష్మి మీద ట్రోల్ల్స్ స్టార్ట్ అయ్యాయి.

 

 

Tags :