ఆ విషయంలో మహేష్ గ్రేట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత ఫ్యాన్‌బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని యాడ్స్ చేసే సంస్థలు ఏ మేరకు లాభాలను అందుకుంటాయోననే డౌట్ సామాన్యుల్లో ఉండటం సహజం. ఎందుకంటే సినిమాలు వేరు, బిజినెస్ వేరు.
తమ హీరో చెప్పినంత మాత్రాన గుడ్డిగా ఓ వస్తువును లేదా ఆ కంపెనీ సేవలను కొనుక్కునేందుకు కస్టమర్లు రెడీగా లేరు. అయినప్పటికీ మహేష్ ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆన్ లైన్ బస్ టికెట్స్ అమ్మే అభి బస్ యాప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మొదట్లో అంత రెస్పాన్స్ లేదు.
దీంతో తమ కంపెనీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు నెం.1 హీరో కావాలని మహేష్ ను సెలెక్ట్ చేసుకుని, 2016లో మహేష్ తో అభి బస్ ఒప్పందం చేసుకుంది. అప్పటివరకు రోజుకు 3 వేల టికెట్స్ అమ్ముడుపోయే పరిస్థితి నుంచి ఏడాది తిరిగేలోపు రోజుకు 20 వేల టికెట్లకు పైగా అమ్ముకునే రేంజ్ కు చేరుకుందని, కామన్ మ్యాన్ కూడా ఈజీగా గుర్తుపట్టేలా మహేష్ అభిబస్ ను చేరువ చేశారని అభిబస్ వ్యవస్థాపకుడైన సుధాకర్ రెడ్డి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పటికీ మహేష్ తమతో ఈ బంధాన్ని కొనసాగిస్తున్నాడని ఆయన తెలిపాడు.