రాజమౌళి తర్వాత మహేష్ ఇంట్రెస్టింగ్ లైనప్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించాలని రాజమౌళి చూస్తున్నాడు. ఇండియన్ సినిమాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుందని సమాచారం.
ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత లేదన్నా కనీసం రెండేళ్ల తీసుకుంటాడు. ఆ తర్వాతే మహేష్ వేరే డైరెక్టర్లతో సినిమాలు చేయనున్నాడు. ప్రస్తుతం మహేష్ కోసం లైన్ లో ముగ్గురు స్టార్ డైరెక్టర్లున్నారు. రాజమౌళి సినిమా పూర్తయ్యే లోపు సందీప్ రెడ్డి వంగా- మహేష్ కాంబోలో సినిమా అనౌన్స్ చేసే అవకాశముంది.
ఈ సినిమాను టీ సిరీస్ నిర్మించనుంది. ఆ తర్వాత హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ తో మహేష్31 ఉండనుందంటున్నారు. త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాల ఫలితాలపై ఈ సినిమా ఆధారపడి ఉండనుంది. వీరిద్దరితో పాటూ కొరటాల శివతో మహేష్ ఓ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. దేవర సిరీస్ తో పాటూ కొరటాల నుంచి వచ్చే తర్వాతి సినిమాల ఫలితాలపై మహేష్ నిర్ణయం ఉంటుందని సినీ విశ్లేషకులంటున్నారు. అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ లో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో సినిమాను నిర్మించే ఛాన్స్ ఉందట. మొత్తానికి మహేష్ నెక్ట్స్ ఐదారేళ్ల వరకు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు అర్థమవుతుంది.