గల్ఫ్ బీమాపై మహేష్ బిగాల హర్షం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంపై బిఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్‌కు గల్ఫ్ కార్మికుల బాధలు విన్నవించామని, గల్ఫ్ కార్మికులకు అన్ని రకాలుగా సాయం చేస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఈ విషయమై ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు కూడా బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని, కేసీఆర్ ఇచ్చిన ఈ ఒక్క హామీతో ఉత్తర తెలంగాణలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని ఆయన తెలిపారు. ముఖ్యమంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంత వాసులకు దీనివల్ల లాభం జరుగనుందన్నారు. మరోసారి అత్యధిక మెజారిటీతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని బిగాల ఆశాభావం వ్యక్తం చేశారు.