Radha Spaces ASBL

గుంటూరు కారం ఘాటెక్కువ‌లానే ఉందే..

గుంటూరు కారం ఘాటెక్కువ‌లానే ఉందే..

ఎప్ప‌టినుంచో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైమ్ రానే వ‌చ్చింది. ప్ర‌తీసారి కృష్ణ పుట్టిన‌రోజుకు మ‌హేష్ త‌న సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదొక‌టి ఉండేలా చూసుకుంటాడు. ఈ సారి కృష్ణ జ‌యంతికి మ‌హేష్, త్రివిక్ర‌మ్ తో క‌లిసి చేస్తున్న త‌న 28వ సినిమా టైటిల్ ను రివీల్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. 

మోసగాళ్ల‌కు మోస‌గాళ్లు సినిమా రీరిలీజ్ అయిన అన్ని థియేట‌ర్ల‌లో ఈ టైటిల్ గ్లింప్స్ ను రివీల్ చేశారు మేక‌ర్స్. గుంటూరు కారం అనే టైటిల్ తో మ‌హేష్ చాలా రోజుల త‌ర్వాత ఓ స్పైసీ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ టైటిల్ మాస్ కు బాగా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు కూడా ఎక్కువే. ఇక టైటిల్ గ్లింప్స్ విష‌యానికొస్తే కేవ‌లం మ‌హేష్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో ఎలా ఉంటుంది అనేది మాత్ర‌మే ఇందులో చూపించారు.

క‌థ‌కు సంబంధించిన ఎలాంటి హింట్స్ ఈ గ్లింప్స్ లో రివీల్ చేయ‌లేదు. ఇప్ప‌టికే వ‌చ్చిన పోస్ట‌ర్స్ లోని గ‌ళ్ల చొక్కా, ఎర్ర‌టి కండువాని నుదిటి మీద క‌ట్టుకుని లుక్ మాత్రం సూప‌ర్ అనేలా ఈ లుక్ ని రిలీజ్ చేశారు. త్రీడీలో బీడీ క‌న‌ప‌డుతుందా అనే ఒకే ఒక్క డైలాగుతో గ్లింప్స్ ని ఫినిష్ చేసేశాడు త్రివిక్ర‌మ్. ఓవ‌రాల్ గా గ్లింప్స్ లో త‌క్కువ కంటెంటే ఉంది కానీ రిలీజ్ కు 7 నెల‌ల ముందు ఇంత‌కంటే ఎక్కువ రిలీజ్ చేయ‌డం కూడా క‌ష్ట‌మే. 

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా కీల‌కభాగం మిగిలే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు షూట్ చేసిన దాంట్లో ఒక మ‌చ్చుతునక‌ను తీసుకొచ్చి త్రివిక్ర‌మ్ మ‌హేష్ ఫ్యాన్స్ ను స‌ర్‌ప్రైజ్ చేశాడు. ఇక ఈ గ్లింప్స్ కు థ‌మ‌న్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్ప‌టిలానే బాగా ఎలివేట్ అయింది. ఇప్ప‌టికే అత‌డు, ఖ‌లేజా క‌లిసి చేసిన మ‌హేష్ త్రివిక్ర‌మ్ కు ఆ రెండు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ నే మిగ‌ల్చ‌గా, మ‌రి ఈ గుంటూరు కారం అయినా స‌క్సెస్ ని ఇస్తుందేమో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :