సెట్స్ పైకి హీరో మహేష్...

సెట్స్ పైకి హీరో మహేష్...

సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ సెట్స్ లోకి వచ్చేస్తున్నారా? ఇక రోల్, కెమెరా, యాక్షన్... అనే సందడి మహేష్ మూవీ కి వినిపించబోతుందా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 2022 సంవత్సరం మహేష్ కి మర్చిపోలేని విషాదకరమైన సంఘటనలని మిగిల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు తన సోదరుడైన రమేష్ బాబు ని కోల్పోయారు. అప్పటినుండి మహేష్ కుటుంబాన్ని విషాదం వెంటాడుతూనే ఉంది. రమేష్ బాబు మరణం నుండి తేరుకునేలోపే, మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించించడం జరిగింది. ఇది ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తల్లి మరణం నుండి తేరుకుంటున్నాడు అనుకున్న తరుణంలో, తండ్రి అయిన హీరో సూపర్ స్టార్ కృష్ణ అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించారు.

ఇలా ఒకటి తర్వాత ఒకటి జరిగిన సంఘటనలతో మహేష్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. వరుసగా తన కుటుంబానికి, తనకు పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళందరూ మృతి చెందడంతో మహేష్ బాబు తీవ్ర ఆందోళనకి గురయ్యారు అని మహేష్ సన్నిహితులు చెప్తున్నారు.నలుగురిలో ఉన్నపుడు చిరునవ్వుతో సరదాగానే ఉన్నా, ఒంటరిగా ఉన్న సమయాల్లో మహేష్ బాబు చాలా భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహేష్ ఇంట్లో ఉండడం కన్నా సెట్స్ మీదకి వచ్చి షూటింగ్ లో పాల్గొంటే మంచిదని, అలా చేయడం వల్ల తాను మామూలు మనిషి అవుతాడని అందరూ అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ని డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి మొదలు పెడితే బాగుంటుందని మహేష్ సన్నితులు భావిస్తున్నారట.

ఇందుకు మహేష్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి మహేష్ తన 28వ‌ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ మూవీ షెడ్యూల్ ని పూర్తిచేసిన త్రివిక్రమ్, తన స్క్రిప్ట్ ని కాస్త మార్చినట్లు తెలుస్తుంది. కొత్తగా మార్చిన స్క్రిప్ట్ ప్రకారం నటి శోభనని కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మిగతా నటీనటులు, సాంకేతిక సిబ్బందిలో ఎలాంటి మార్పు లేదని, మూవీ రెగ్యులర్ షూట్ కి అంతా రెడీగా ఉందని, మహేష్ సెట్స్ లోకి అడుగు పెట్టగానే రోల్, కెమెరా, యాక్షన్ అనడమే అని తెలుస్తోంది. త్వరలోనే మహేష్ తిరిగి తన నటనతో ప్రేక్షకుల ముందుకి వస్తారని కోరుకుందాం.

 

 

Tags :