Radha Spaces ASBL

సిని‘మా’ ఎన్నికలే.. ఎలా జరిగాయంటే..!

సిని‘మా’ ఎన్నికలే.. ఎలా జరిగాయంటే..!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ మూడు నెలలుగా ఏ అసోసియేషన్‌కి రానంతగా పబ్లిసిటీ  ఇచ్చింది మీడియా. దీంతో సామాన్య ప్రజానీకానికి సైతం సినిమా నటి నటుల్లో రెండు వర్గాలు ఉన్నట్లు అవగతం అయ్యింది. కేవలం 950 మంది సభ్యులున్న మా ఎన్నికలకు 600లో సభ్యులు మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటారేమో? ఈ మాత్రం దానికి మీడియా అత్యుత్సహం చూపిస్తుందని, అవసరానికి మించిన పబ్లిసిటీ ఇస్తుందని నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే మరో వైపు మేము బిల్డింగ్‌ కడతాం అంటే మేము బిల్డింగ్‌ కడతాం అని ఎడా పెడా ప్రతి న్యూస్‌ ఛానల్‌కి ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దేశ సౌభాగ్యం కోసం ప్రజలను ఆకట్టుకోవడం కోసం పార్లమెంట్‌, శాసన ఎలక్షన్స్‌లలో తలకు మించిన మేనిఫెస్టో తయారు చేస్తారు. కానీ ఒక సెక్టార్‌కి సంబందించిన వెయ్యి లోపున్న సభ్యుల కోసం మా ఎన్నికల మేనిఫెస్టో చూడబోతే పెద్ద కార్పొరేట్‌ బడ్జెట్‌ తలపిస్తుంది. విష్ణు అయితే నా సొంత డబ్బులతో మా సొంత భవనం నిర్మిస్తానని, స్థలం కూడా చూశామని చెప్పుకొచ్చాడు. కేవలం ముగ్గురు స్టాఫ్‌తో నడిచే ఒక ఆర్గనైజషన్‌ మీటింగులకు, అడ్మినిట్రేషన్‌కు అంత పెద్ద భవనం అవసరమా? అని ఇప్పటివరకు మన జర్నలిస్టులు కూడా అడగకపోవడం ఆశ్చర్యంగా వుంది. సంక్షేమ పథకాలు చూస్తే భారీగా వున్నాయి, కానీ ఆదాయం ఎక్కడనుండి వస్తుందో తెలియదు. అసలే కరోనా సంక్షోభంతో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అవుతుంది. గత ఏడాది విడుదల కావలసిన చిత్రాలు వచ్చే ఏడాదికి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇలాంటి తరుణం లో నటి నటుల వద్ద అవసరానికి మించిన డబ్బులుంటాయని, సంక్షేమ పథకాల అమలుకు ఫండ్‌ రైజింగ్‌ ఎలా చేస్తారన్నని మిలియన్‌ డాలర్స్‌  క్వశ్చన్‌?  ఇదిలా ఉంటే లోకల్‌ నాన్‌ లోకల్‌ అంటూ ఇంత గొడవ అవసరమా? అదీ పబ్లిక్‌ గా మీడియా ముందుకొచ్చి తిట్టుకోవాలా? ఇది ప్రభుత్వ పదవి కాదు, అతి పెద్ద హోదా వుండే అధికారము కాదు, కేవలం పరువు కోసం నడుస్తున్న పోరాటం సినిమా నటి నటులు రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయాస ఇది.

ఏది ఎలా వున్నా మొత్తానికి అక్టోబర్‌ 10న మా ఎన్నికలు జరపడానికి తేదీ ని ప్రకటించారు. ప్రకాశం రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు నామినేషన్‌ వేయడం జరిగింది. ప్రకాష్‌ రాజ్‌ సపోర్టుగా మెగా ఫామిలీ మెంబెర్స్‌, మంచు విష్ణు సపోర్టుగా సీనియర్‌ నరేష్‌ నిలబడ్డారు. తన ప్యానెల్‌ గెలిచిన తర్వాత చేయబోయే కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఇందులో మా అసోసియేషన్‌లో సభ్యులకు విద్య, వైద్యం, ఆరోగ్యంకు సంబంధించిన తానేం చేయబోతున్నాననే విషయాన్ని వివరించారు.

అవకాశాలు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో వున్న కొంతమంది సభ్యులు సినిమాల్లో నటించుటకు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం ‘మా యాప్‌’ను క్రియేట్‌ చేస్తాం. అందులో మాలోని ప్రతి సభ్యుడి పోర్ట్‌ పోలియోను ఉండేలా చూసుకుంటాం. యాక్సెస్‌బిలిటీ ఉన్న నిర్మాతలకు, దర్శకులకు, నిర్మాణ సంస్థలకు ఈ నటీనటుల వివరాలను జాబ్‌ కమిటీ ద్వారా అందజేస్తాం. సినిమాలు, ఓటీటీ వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం.

‘మా’ భవనం

తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా ‘‘మాలో వున్న ప్రతి నభ్యుడికీ ఉపయోగపడే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ‘‘మా సొంత భవన నిర్మాణం.

సొంత ఇంటి కల

అర్హులైన ‘‘మా నభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహ నిర్యాణం.

వైద్యసహాయం

‘మా’లో వున్న ప్రతి ఒక్క సభ్యుడికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ సమగ్రమైన ఫ్రీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (ఆరోగ్య భీమా) అందజేస్తాం. పలు కార్బోరేట్‌ వాస్పిటల్స్‌తో అనుసంధానమై ‘‘మా కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందిస్తాం. మూడు నెలలకు బకసారి ‘‘మా కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచిత మెడికల్‌ టెస్ట్‌లు చేయిస్తాం. ప్రతి ఒక సభ్యుడికి ఉచితంగా 5హెల్త్‌ కార్డ్‌లు అందిస్తాం. ఇప్పటికే 946 మంది సభ్యులు (అసోసియేట్‌ మెంబర్స్‌తో సహా వున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి పేరిట మూడు లక్షల జీవిత భీమా అమలులో ఉంది. దీన్ని గణనీయంగా పెంచుతాము.

చదువుల తల్లి

అర్హులైన సభ్యుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు విద్యా సహాయం. దీనికి సంబంధించిన పలు యూనివర్సిటీలతో మాట్లాడుతున్నాం. స్కాలర్‌ షిప్స్‌ అందించేలా తగు చర్యలు కూడా తీసుకుంటాం.

కళ్యాణ లక్ష్మి

అర్హులైన మా సభ్యులకు ‘‘మా’’ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్ధిక సహాయం కొనసాగింపబడుతుంది.

మహిళా రక్షణ హై పవర్‌ కమిటీ (స్త్రీ సాధికారత)

మా చరిత్రలో మొట్టమొదటిసారిగా ‘‘మా మహిళా సభ్యుల సంక్షేమం మరియు రక్షణ కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ఆర్థిక సహాయం అందజేస్తాం.

వృద్ధ కళాకారుల సంక్షేమం

మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రస్తుతం పెన్నన్‌ల కోసం పెట్టుకుని ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రతి నెలా పెన్నన్లు అందేలా చేస్తాం. అలాగే 6,000/-లు ఉన్న పెన్నన్‌ను గణనీయంగా పెంచుతాం. అంతేకాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వపరంగా ఉన్న పెన్నన్‌ పథకాలు మరియు ఎన్‌బీఎఫ్‌సీ ఉన్న పథకాలు మన సభ్యులకు కూడా వర్తించేలా చేస్తాం.

ఓటు హక్కు

గౌరవ సభ్యత్వం ఇచ్చిన సీనియర్‌ సిటిజన్స్‌కి ఓటు హక్కు వచ్చేలా ఎ.జి.ఎంలో ఆమోదం తెచ్చుకుని అమలు చేస్తాం.

‘మా’ మెంబర్‌షిప్‌ కార్ట్‌

కరోనా వల్ల కళాకారులందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు. కమిటీ ఆమోదంతో ఆర్థికంగా వెనకపడ్డ యువతను ప్రోళ్ళహించడానికి కొంత కాలపరిమితి వరకు ‘‘మా మెంబర్‌షిప్‌ని రూ. డెబ్బై ఐదు వేలకి (75,000/) తగ్గించి ఇస్తాం.

‘మా’ ఉత్సవాలు

ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టడానికి ఒక కల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీని ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి ‘మా’ని ఆర్థికంగా బలపరుస్తాం. ‘‘మా’’ నటీనటులందరం కలిసి ‘‘మా ఉత్సవాలను ఒక పండుగలా జరుపుకుందాం.

కేంద్ర, రాష్ట్ర పథకాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందేలా చేస్తాం.

మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌

‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి వున్నచో మోహన్‌ బాబు ఫిల్మ్‌ ఇనిఫ్టిట్యూట్‌ ద్వారా 50% స్కాలర్‌షిప్‌తో శిక్షణ ఇస్పించడమేకాక, పలు పేరొందిన ఫిల్ఫ్‌ ఇనిస్టిట్యూట్స్‌లో తగినంత డిస్కాంటు ఇప్పించే ప్రయత్నం చేస్తాం.

ప్రభుత్వాల సహాయసహకారాలు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న చిన్న చిన్న తగాదాలతో జరిగాయి. సాయంత్రం ఫలితాలు ప్రకటించారు 107 ఓట్ల ఆధిక్యంతో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు గెలిచారు. ప్రకాశం రాజ్‌ పానెల్‌ నుండి 11మంది కార్యనిర్వాహక సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్‌ నుండి 7గురు సభ్యులు గెలుపొందారు. ఈ సందర్భంగా  మోహన్‌బాబు మాట్లాడుతూ:   ‘ఇది ‘మా’లోని సభ్యులందరి విజయం. నా బిడ్డ (మంచు విష్ణు), అతని జట్టు సభ్యులు గెలిచారు. ఇది ఆనందం అనుకుంటే కరెక్ట్‌ కాదు. భయంకరమైన ప్రామిస్‌లు చేసేశారు. వాటన్నింటినీ నా బిడ్డ వందశాతం సాధిస్తాడు. నా బిడ్డ చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే... జరిగింది... జరిగిపోయింది.. అందరం కళామతల్లి బిడ్డలం అని గుర్తుపెట్టుకోవాలి.

నటుడిగా నాకు జన్మనిచ్చిన దాసరిగారు ఎక్కడ ఉన్నారో!. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్‌ ఎలక్షన్స్‌ జరగకుండా ఏకగ్రీవంగా జరిగేలా పెద్దలు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. నా తమ్ముడు నరేశ్‌ చాలా కష్టపడ్డారు. ఎలక్షన్‌ అధికారికి, సహకరించిన ‘మా’ సభ్యులకు ధన్యవాదాలు.’’ అంటూ చెప్పుకొచ్చారు.  దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల హడావిడికి  తెరపడిరది. ప్రెసిడెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ, ఇద్దరు వైస్‌ప్రెసిడెంట్స్‌, ఇద్దరు జాయింట్‌ సెక్రటరీలు, ట్రెజరర్‌లతో పాటు 18 మంది ఈసీ (ఎగ్జిక్యూటివ్‌ కమిటీ) సభ్యులతో కూడిన 26 మంది ‘మా’ (2021-2023) ప్యానల్‌ సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. విజేతలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ ప్రకటించారు. ‘‘925 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో 883 ఓటర్లు ఉండగా 665 మంది ఓట్లు వేశారు (52 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు). ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌, జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు.

‘మనమంతా ఒకటే కుటుంబం. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే నాకు చాలా ఇష్టం. నరేశ్‌గారికి, సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌. ఆ ప్యానల్‌, ఈ ప్యానల్‌ అంటూ లేదు. మేం అందరం ఒకటే కుటుంబం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్‌ కలిగింది. ‘మా’లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు’’ అని అన్నారు మంచు విష్ణు.

రికార్డు పోలింగ్‌

‘మా’ ఎలక్షన్స్‌లో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు పోలింగ్‌ నమోదు అయ్యింది. గత ‘మా’ ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే నమోదు కాగా, ఈ సారి 665 (883 ఓట్లకు గాను..70 శాతానికి పైగా) ఓట్లు పోల్‌ అయ్యాయి. పోలైన ఓట్లలో 52 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు. అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ రెండు ప్యానల్స్‌ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పోలింగ్‌ సమయాన్ని మరో గంట పొడగించారు. ఎప్పుడూ లేనట్లుగా ‘మా’లో భాగమైన సభ్యులు ఇతర రాష్ట్రాల (ముంబై, చెన్నై, కర్ణాటక) నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ సమయాన్ని పొడగించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ‘మా’ సభ్యులు కూడా ఉత్సాహంగా ‘మా’ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి కారణాలు పోలింగ్‌ శాతం పెరగడానికి కారణం అయ్యాయని చెప్పుకోవచ్చు.

ఫైటింగ్‌.. బైటింగ్‌.. బెట్టింగ్‌!

‘మా’ ఎన్నికల పోలింగ్‌ మొదలైన కొద్దిసేపటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌కల్యాణ్‌ వంటి స్టార్స్‌ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్‌ బూత్‌లో హడావిడి చేస్తున్న ఓ అజ్ఞాతవ్యక్తిని నటుడు వీకే నరేశ్‌ పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు ప్యానల్‌ సభ్యుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగి, కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరుగుతోందంటూ ఇరువర్గాల అభ్యర్థులు ఆరోపించారు. అలాగే పోలింగ్‌ కేంద్రంలో తమ ప్యానల్స్‌ తరఫున ప్రచారం చేసే ప్రక్రియలో భాగంగా శివబాలాజీ, సమీర్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో శివబాలాజీ చేతిని నటి హేమ కొరకడం పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మరోవైపు ‘మా’ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు బెట్టింగ్‌రాయుళ్లు ‘మా’ ఎన్నికల జయాపజయాలపై బెట్టిం గ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఫైటింగ్‌.. బైటింగ్‌.. బెట్టింగ్‌ నడుమ ఎన్నికలు జరిగాయి.

ఓటుకు దూరం

‘మా’ ఎన్నికల గురించి హీట్‌ నడుస్తున్నప్పటికీ కొందరు ప్రముఖ నటీనటులు ఎన్నికల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్‌, రానా, మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌, నిహారిక, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సుమంత్‌, సుశాంత్‌ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిసింది. ఇంకా మహేశ్‌బాబు (స్పెయిన్‌లో ‘సర్కారు వారిపాట’ షూటింగ్‌లో ఉన్నారు) ప్రభాస్‌, ఎన్టీఆర్‌, నితిన్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ముంబయ్‌ నుంచి జెనీలియా, ఢల్లీి నుంచి జయప్రద హైదరాబాద్‌కు వచ్చి ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం.

చెల్లని ఓట్లు

ఈసీ మెంబర్స్‌ కోసం పోలైన 665 ఓట్లలో 44 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్‌ అధికారులు వెల్లడిరచారు. అయితే ‘మా’ సభ్యులకు పోలింగ్‌పై అవగాహన లేకపోవడం వల్ల చెల్లని ఓట్లు నమోదయ్యాయా? లేక సభ్యులకు ఇష్టం లేక చెల్లని విధంగా ఓట్లు వేశారా? అన్న చర్చలు జరుగుతున్నాయి.

ప్రత్యర్థుల ఆలింగనం

‘మా’ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నటుడు, నిర్మాత నాగబాబు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిరచారాయన. ‘‘ప్రాంతీయవాదం.. సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక అసోసియేషన్లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం’’ అని ట్వీట్‌ చేశారు నాగబాబు.

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, ఇతర విజేతలందరికీ పేరు పేరునా అభినందనలు.. నా శుభాకాంక్షలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచనట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. వివాదాలు, విమర్శలకు మాత్రం పుల్‌స్టాప్‌ పడడం లేదు. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్‌రాజ్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు.. తన ప్యానల్‌ తరపున గెలిచిన 11 మందితో రాజీనామాలు చేయించాడు. ఇదే సమయంలో కౌంటింగ్‌ సందర్భంగా అవకతవకలు జరిగాయని ప్రకాశ్‌ రాజ్‌ ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు. ఆయన ప్యానల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్‌ అనసూయ సైతం పోలింగ్‌ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆమె విజయం సాధించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అనసూయతో పాటు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ షాక్‌కు గురైంది. దీనిపై ‘‘రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా’ అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు.

తాజాగా ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్‌.. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా అనౌన్స్‌ చేయడానికి ముందే ఆమె గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగిందని కృష్ణమోహన్‌ చెప్పారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.  ‘మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి’ అంటూ మంచు విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాజీనామా చేసినా ప్రశ్నిస్తాం..

ఇక తన రాజీనామా గురించి మాట్లాడుతూ.. మాలోనే కొనసాగుతానని, రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని, అయితే దానికి ఓ కండీషన్‌ ఉందని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. బైలాస్‌లో బయటవాళ్ల పోటీ చేయకుండా మార్పు చేయవద్దు. ఎవరైనా పోటీ చేయవచ్చు అన్నదానికి విష్ణు ఒప్పుకుంటే  రాజీనామాను వెనక్కి తీసుకుంటా అని పేర్కొన్నారు. ఇక రాజీనామా చేసినా మా సభ్యల సంక్షేమం కోసం ప్రశ్నిస్తామని, ఓడిపోయాం అని మేం వదిలేయబోమని స్పష్టం చేశారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల పర్వం ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలింగ్‌ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ప్రకాశ్‌రాజ్‌. పోలింగ్‌ జరిగిన రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు గురువారం లేఖ రాశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్‌ మా సభ్యులను బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మీరే వారిని, వారి అనుచరులను పోలింగ్‌ ప్రదేశాల్లోకి అనుమతించారని భావిస్తున్నామన్నారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందన్నారు. అసలేం జరిగిందన్నది మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని, ఇందుకోసం పోలింగ్‌ సమయంలో రికార్డైన సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3 నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత అంటూనే వాటిని కోరే హక్కు తమకు ఉందని నొక్కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్‌ లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్‌ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా ఇవ్వడానికి రెడీ అని తెలిపారు.

మాటల్లో మాత్రం తామంతా ఒకేటేనని, ఒకే తల్లి బిడ్డలమని చెప్పుకుంటున్నారు. చేతల్లో మాత్రం అవేవీ కనిపించడం లేదు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఆయన ప్యానెల్‌ మెంబర్ల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మిగతా టాలీవుడ్‌ హీరోలెవ్వరూ కనిపించలేదు. మెగా, అల్లు, దగ్గుబాటి ఫ్యామిలీల నుంచి ఏ ఒక్కరూ హాజరు కాలేదు.

మోహన్‌బాబు పరోక్షంగా మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశాడు. ఇంత మంది ఉన్నాం.. అంత మంది ఉన్నాం.. మా సినిమాలే ఆడతాయ్‌.. అని బెదిరించారంటూ పరోక్షంగా మెగా ఫ్యామిలినీ ఉద్దేశించి మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఇక నరేష్‌ అయితే తన ప్రసంగంలో ఎక్కడా కూడా చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా అంగీకరించినట్టు సుముఖంగా లేనట్టు కనిపించింది. చివర్లో డీఆర్సీ కమిటీ గురించి చెబుతూ కృష్ణంరాజు, మోహన్‌ బాబు, మురళీ మోహన్‌, గిరిబాబు అంటూ ఇలా అందరి పేర్లు చెప్పాడు కానీ చిరంజీవి పేరును కూడా పలకరించలేదు. మంచు విష్ణు బాగానే చేస్తాడు.. ఆ నమ్మకం మాకుంది.. కానీ నరేష్‌ మాత్రం చేయనివ్వడు... ఆయన్ను కాస్త దూరంగా పెట్టండి అని ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే. అయితే వాటికి కౌంటర్లుగా నరేష్‌ ‘మా’ను ఎప్పటికీ అంటిపెట్టుకునే ఉంటాను అని చెప్పినట్టు కనిపిస్తోంది. ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్‌ చేయండి. ‘మా’కు అన్నలా ఎప్పుడూ ఉంటాను. ఆఖరి శ్వాస వరకు ‘మా’ కోసం ఉంటాను’ అని అన్నాడు. ఇంకో సందర్భంలో మా ఏ ఒక్కరి సొత్తు కాదని, కృష్ణం రాజు గారి మాటల్లో చెప్పాలంటే.. ‘మా’ అంటే ఓ దిగ్గజమని అన్నాడు. ఇది అందరిది అని అన్నాడు.

ప్రకాశ్‌రాజ్‌ సంచలన నిర్ణయం

ప్రకాశ్‌రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, పోస్టల్‌ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెనర్జీపై చేయి చేసుకున్నారు. ‘రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్‌ బాబు ఎన్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్‌ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. అందుకే మా ప్యానల్‌ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం’ అని ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :