Radha Spaces ASBL

అమెరికాలో ఘనంగా ‘లాంగ్ ఐలాండ్ గుజరాతీ కల్చరల్ సొసైటీ’ 25 వసంతాల వేడుక

అమెరికాలో ఘనంగా ‘లాంగ్ ఐలాండ్ గుజరాతీ కల్చరల్ సొసైటీ’ 25 వసంతాల వేడుక

అమెరికాలోని లాంగ్ ఐలాండ్‌లో గుజరాతీ కల్చరల్ సొసైటీ (ఎల్ఐజీసీఎస్) సిల్వర్ జూబ్లీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు సిల్వర్ జూబ్లీ కన్వెన్షన్ కోఆర్డినేటర్, వీపీ ప్రోగ్రామ్స్ ఫ్లోరా పరేఖ్ అధ్యక్షత వహించారు. మయూర్ షా అండ్ ఫ్యామిలీ స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి వివిధ సంస్థల అధ్యక్షులు, ఉన్నతాధికారులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరై ఉల్లాసంగా గడిపారు. వీరలో గుజరాతీ సమాజ్‌కు చెందిన హర్షద్ (పాకాజీ), వీటీఎన్‌వైకు చెందిన అనిల్ షా, అమ్నీల్ ఫార్మా గ్రూప్‌కు చెందిన నవీన్ షా (నవికా క్యాపిటల్), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ దిలీప్ చౌహన్ తదితరులు ఉన్నారు. సఫోక్ కౌంటీ ఎగ్జిక్యూటివ్ జాన్ కైమన్ తదితరులు పాల్గొని ఈ మైలురాయిని చేరుకున్నందుకు ఎల్ఐజీసీఎస్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన తర్వాత ఝాన్వీ పటేల్ సంప్రదాయబద్ధమైన గనేష వందనం, అంజలీ పటేల్ కథక్ బాలీవుడ్ నృత్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంస్థ అద్భుతమైన రిప్రజంటేషన్ కలిగి ఉందని, బలమైన పునాదులతో మరో 25 వసంతాలు చూసేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అధ్యక్షులు విజయ్ షా చెప్పారు. అనంతరం ఈ సంస్థ మాజీ అధ్యక్షులు డాక్టర్ మనీభాయీ పటేల్, త్రిభోవన్‌భాయి పటేల్, మఫత్‌భాయి పటేల్, బకుల్‌భాయి మటాలియాను సత్కరించారు. ఆ తర్వాత సంస్థ స్థాపన నుంచి కలిసి కొనసాగుతున్న మయూర్ షా, భద్రేష్ ఆచార్య, గోవింద్ అక్రూవాలా, అమారిష్ కచ్చీ, కేతన్ ఉపాధ్యాయను కూడా సన్మానించారు. ఫ్లోరా పరేఖ్, హర్షద్ పటేల్, కౌశిక్ షాలకు ప్రత్యేక గుర్తింపు అవార్డులను అందించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :