డాక్టర్ శోభా రాజు గారు ఆవిష్కరించిన "లివ్ యువర్ డ్రీమ్స్" తెలుగు పుస్తకము

న్యూ జెర్సీ, యూఎస్ఏ లోని సాయి దత్త పీఠంలో గురు పూర్ణిమ సందర్భంగా గురువుల యొక్క ఆశీర్వాదం తో "లివ్ యువర్ డ్రీమ్స్" తెలుగు పుస్తకమును పద్మశ్రీ అవార్డు గ్రహీత "అన్నమయ్య పదకోకిల" శ్రీమతి డాక్టర్ శోభా రాజు గారు(అమ్మ) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శోభారాజు గారు మాట్లాడుతూ సహజంగా మనం కలల యొక్క మేడలు కడుతూ ఉంటామని వాస్తవానికి వాటిలో ధృడమైనవి ఎంచుకొని వాటి కొరకు సాధన చేయడం అనేది మన జీవనంలో భాగంగా చేసుకోవడం చాల ముఖ్యమని, వాటిని సాధించటం ఎలానో పుస్తక రచయిత ఆచార్య వి వెంకట్ గారు ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేసారని తెలిపారు. కలలు కనడం పిల్లలకు ఎంతో అవసరమని మరియు వాటి ప్రాముఖ్యత గురుంచి తన విద్యార్థులతో జరిగిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అలాగే జులై 6 నుండి 20 వ తేదీ వరకు నార్త్ అమెరిక తెలుగు సొసైటీ తో కలిసి ఒక మ్యూజిక్ వర్కుషాప్ నిర్వహిస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమము లో ముఖ్య అతిధులుగా దాము గేదల గారు మరియు హరి ఇప్పనపల్లి గారు పాల్గొన్నారు.
తదుపరి పుస్తక రచయిత మాట్లాడుతూ తాను రచించిన ఈ పుస్తకాన్ని అమ్మ చేతులమీదగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు శోభా రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి మనిషి జీవితంలో కలలు ఒక భాగమని, వాటిని సొంతం చేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తే సాధ్యమవుతుందని అందుకు అవసరమైన సూచలను ఈ పుస్తకం లో పొందుపరిచామని తెలిపారు. తమ సంస్థలైన అకాడమీ అఫ్ హ్యూమన్ ఎక్స్ లెన్స్(AOHE) మరియు గ్లోబల్ నెట్ వర్క్ అఫ్ యంగ్ యోగిస్ (GNYY) ద్వారా ప్రాజెక్ట్ అర్జున్ లో భాగంగా గత 15 సంవత్సరాలుగా వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు ఆర్ఫన్ హోమ్స్ లలో తమ సంస్థ సేవలైన విద్య, వినోదం, వ్యాయామము, క్రీడలు మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం లో శిక్షణ తరగతులలు నిర్వహిస్తూ వ్యక్తిత్వ వికాసము మరియు జీవన నైపుణ్య విలువలను బోధిస్తూ, ఇందులో భాగంగా ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీచేస్తున్నామని తెలియచేసారు. (GNYY) మరియు "జర్నీ అఫ్ ది మైండ్ బాడీ అండ్ సోల్" అనే కార్యక్రమం ద్వారా ఎన్నో రెట్రీట్స్ నిర్వహిస్తూ భారతదేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్నామని తెలియచేసారు. భవిష్యతులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా వీలైనంత మందికి సేవ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు, పుస్తకము కావలిసినవారు ఫోన్ నెం. 9949957979 కు సంప్రదించగలరు.