రాబోయే ఎన్నికల కోసం కాకుండా.. రేపటితరల కోసం : మంత్రి కేటీఆర్

ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల దాకా అద్భుత పురోగతితో తెలంగాణలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భగా నైపుణ్య అభివృద్ధి కేంద్రం, కామన్ ఫెసిలిటి సెంటర్, వ్యర్థాల శుద్ధి కేంద్రం, పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యాలయాలను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఏకకాలంలో 51 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రారంభించిన మంత్రులు చిన్నారుల కోసం బొమ్మలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ టాయ్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. రాబోయే ఎన్నికల కోసం కాకుండా రేపటితరల కోసం కేసీఆర్ పని చేస్తారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.






