కృతికి ఇప్పుడైనా బ్రేక్ దొరుకుతుందా?
టోవినో థామస్, కృతి శెట్టి జంటగా నటించిన ఏఆర్ఎం మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ కు సరిపడా టైమ్ లేకపోవంతో ఉన్నంతలోనే సినిమాను ప్రచారం చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. అయితే మలయాళ హీరో టోవినో థామస్ కు ఇక్కడ మార్కెట్ లేదు. ఈ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది.
అయితే ఈ సినిమా ఇప్పటిది కాదు. ఎప్పుడో ఆరేళ్ల ముందు ఈ సినిమా మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా లేటవుతూ వస్తుంది. ఈ సినిమా సక్సెస్ టోవినో కంటే కృతికి చాలా కీలకం. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతికి తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగలడంతో కృతికి ఆఫర్లు తగ్గాయి.
ఆ తర్వాత కోలీవుడ్ పై కృతి ఫోకస్ చేసింది. ఈ లోపు ఏఆర్ఎం రూపంలో మలయాళ ఆఫర్ వచ్చింది. అన్నీ బాగుండి ఈ సినిమా హిట్ అయితే మాత్రం కృతికి మలయాళంలో మంచి ఆఫర్లొచ్చే వీలుంది. పైగా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా కాబట్టి కృతికి ఈ సినిమా కీలకం కానుంది. మరి ఈ సినిమా అయినా కృతికి తను కోరుకున్న బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.