Radha Spaces ASBL

వైసీపీ గూటికి కేశినేని నాని..! లైన్ క్లియర్ చేసిన జగన్..!?

వైసీపీ గూటికి కేశినేని నాని..! లైన్ క్లియర్ చేసిన జగన్..!?

తెలుగుదేశం పార్టీలో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. చాలాకాలం నుంచే ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కేశినేని నాని కీలక నేత. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. వైసీపీ వేవ్ ను సైతం తట్టుకుని నిలబడ్డ నాయకుడాయన. పార్టీతో పాటు వ్యక్తిగత ప్రతిష్టే కేశినేని నానిని గెలిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలను తట్టుకోలేక సతమతమవుతున్నారు కేశినేని నాని. అందుకే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

కేశినేని నానికి కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ముఖ్యంగా సోదరుడు కేశినేని చిన్ని.. నానికి మేకులా తయారయ్యారు. బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, కేశినేని చిన్ని, నాగుల్ మీరా.. లాంటి నేతలంతా ఒక వర్గంగా ఉంటే కేశినేని నాని మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. కేశినేని నాని భవన్ టీడీపీ కార్యాలయంగా ఉంది. అయితే ఈ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు ఇష్టంలేని నేతలంతా మరో కార్యాలయం ఏర్పాటు చేసకుని అక్కడి నుంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. దీన్ని బట్టి గ్యాప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక, నానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో వీళ్లంతా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

తనను పక్కన పెట్టేందుకు టీడీపీతో పాటు అందులోని నేతలు సిద్ధమయ్యారని కేశినేని నాని గ్రహించారు. అందుకే ఆయన చాలాకాలం నుంచే పార్టీతో సంబంధం లేకుండా తనపని తాను చేసుకుపోతున్మారు. ఎప్పుడైనా సందర్భం ఉంటే తప్ప చంద్రబాబును కూడా కలవట్లేదు. విజయవాడ ఎంపీ సీటుతో పాటు కుమార్తెకు ఎమ్మెల్యే సీటు సాధించుకోవాలనేది నాని ఆశ. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో తనకు, తన కుమార్తెకు సీటు దక్కుతుందనే నమ్మకం నానికి కనిపించడం లేదు. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇటీవలికాలంలో ఆయన టీడీపీ నేతలకంటే ఎక్కువగా వైసీపీ నేతలతోనే కనిపిస్తున్నారు. వాళ్లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలు కేశినేని నానిని పొగుడుతున్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమైందనే ప్రచారం జోరందుకుంది.

కేశినేని నాని చేరికకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పీవీపీ పోటీ చేశారు. ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్. ఇప్పటికీ ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియట్లేదు. ఇలాంటప్పుడు కేశినేని నాని లాంటి బలమైన నేత వస్తే తప్పకుండా పార్టీకి మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే జిల్లా వైసీపీ నేతల ప్రపోజల్ ను జగన్ వెంటనే ఆమోదించారని తెలుస్తోంది. అయితే కుమార్తెకు కూడా ఎమ్మెల్యే సీటు ఇస్తారా.. లేదా.. అనేదానిపై క్లారిటీ లేదు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :