Oct 5న KCTCA బతుకమ్మ సంబరాలు
బతుకమ్మపండుగ, తెలంగాణా సాంస్కృతిక చిహ్నం, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ.
కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఒక వినూత్నమైన ప్రత్యేకత వుంది, ముఖ్యంగా తెలంగాణ జానపద కళాకారులు తెలంగాణ అస్తిత్వ చాటుతూ ఆలపించే తెలంగాణ జానపద బతుకమ్మ పాటలు ప్రేక్షకులను మనం తెలంగాణాలోనే బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకొంటున్నామా అనిపించేలా ఆటలు పాటలు ఎంతో ఉత్సాహం గ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉత్సాహభరితం గా బతుకమ్మ సంబరాలలో పాల్గొనే విధం గా చేయటమే ప్రత్యేకత!! ఈసారి KCTCA బతుకమ్మ సంబరాలు Overland Park నడిబొడ్డులో మీ అందరకు అనువైన ప్రదేశము మరియు అతి దగ్గర లో వున్నా Lakewood Middle School జరపటం!.
కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ సంబరాలకి మీకిదే మా ఆహ్వానం! ఈ సారి కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ సంబరాలకి చాలా ప్రత్యేకతలు వున్నాయి !!!
ముఖ్యముగా తెలంగాణ నుండి జానపద కళాకారుడు రేలా రేలా ఫేమ్ రవి తెలంగాణ నుంచి KCTCA ఆహ్వానం మేరకు KCTCA 18th వార్షికోత్సవ బతుకమ్మ మరియు దసరా సంబరాలలో బతుకమ్మ పాటలు పాడి మరియు మీతో బతుకమ్మ ఆడించటానికి మీతో పాల్గొనటానికి వచ్చేస్తున్నారు! KCTCA ప్రత్యేకత ఏమిటంటే DJ పాటలు కాదు, సాంప్రదాయ పద్దతిలో సాంప్రదాయ బతుకమ్మ పాటలు పడుకొని పండుగ జరుపుకోవటం, ప్రత్యేకముగా జమ్మి ఆకు( బంగారం) చిన్న పెద్ద తో పంచుకొని అలై బలై చేసుకోవటం, ఇటువంటి ఇంకా ఎన్నో! మరికొన్ని updates మీతో పంచుకొంటాము.
మీకు, మీ కుటుంబానికి మరియు మీ బంధుమిత్రులకు ఇదే మా ఆహ్వానం!