ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : థ్రిల్లింగ్ అడ్వెంచర్ 'కార్తికేయ2'

రివ్యూ : థ్రిల్లింగ్ అడ్వెంచర్ 'కార్తికేయ2'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్
నటీనటులు : నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య మీనమ్‌,
కేఎస్‌ శ్రీధర్‌, శ్రీనివాసరరెడ్డి, వివా హర్ష, సత్య, ప్రవీణ్, తులసి తదితరులు
సంగీతం : కాల భైరవ, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాతలు:  టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌
దర్శకత్వం: చందూ మొండేటి
విడుదల తేది: 13.8.2022

హ్యాపీడేస్ చిత్రంతో కెరీర్ ప్రారంభించి, నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ తర్వాత యువత తో సోలో హిట్ కొట్టాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాలతో వరుస సక్సెస్‌ల‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత  వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. 2014లో నిఖిల్, చందు మొండేటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కార్తికేయ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. దానికి కొన‌సాగింపుగా చేసిన చిత్ర‌మే కార్తికేయ 2. అనుకున్న డేట్ కి రిలీజ్ కాకపోవడానికి ఎన్నో కారణాలున్నా నేడు(ఆగస్ట్‌ 13) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో కార్తికేయ2 పై హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

కథంతా ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం. నేటి కలియుగంలోని ఎన్నో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆర్కియాలజిస్ట్ రావు తెలుసుకుంటాడు. కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ్‌) ఎంబీబీఎస్ పూర్తి చేసి స్నేహితులు ప్ర‌వీణ్, స‌త్య‌ల‌తో క‌లిసి డాక్ట‌ర్‌గా కొన‌సాగుతుంటాడు. సైన్స్‌ను న‌మ్ముతూ త‌న‌కు ఎదురైన స‌వాళ్ల‌కు స‌మాధానాల‌ను వెతుకుతూ ఎంతో మంచి పేరు సంపాదిస్తాడు. అదే సమయంలో  తల్లి (తులసి)తో కలిసి ద్వారక దర్శనానికి వచ్చిన డాక్టర్‌ కార్తిక్‌ని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అక్క‌డ అత‌ని మేన‌మామ సదానంద (శ్రీనివాస్ రెడ్డి) కూడా ఉంటాడు.అయితే ఆర్కియాలజిస్ట్ రావును కార్తిక్‌కే హత్య చేశాడని తప్పుడు కేసు నమోదు చేస్తారు. మ‌రో వైపు గ్రీక్ దేశానికి వెళ్లిన ఆర్కియాల‌జిస్ట్ రావు అక్క‌డ కృష్ణుడు ఈ మాన‌వాళికి మంచి చేయ‌డానికి ఓ అపూర్వ‌మైన వ‌స్తువును ఎక్క‌డో దాచి ఉంచాడ‌నే విష‌యాన్ని తెలుసుకుంటాడు. అత‌న్ని డాక్ట‌ర్ శాంత‌న్ (ఆదిత్య మీన‌న్) మనుషులు వెంబడిస్తుంటారు. వారి నుంచి త‌ప్పించుకుని రావు ద్వార‌కా చేరుకుంటాడు. పోలీసు స్టేషన్‌లో ఉన్న కార్తిక్‌ని రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. అసలు కార్తిక్‌ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్‌తో చెప్పిన విషయం ఏంటి? శ్రీకృష్ణుడి కంకణం కనిపెట్టాలని కార్తిక్‌ ఎందుకు డిసైడ్‌ అవుతాడు? ఈ క్రమంలో కార్తిక్‌కు డాక్టర్‌ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్‌ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్‌ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు:

హీరో నిఖిల్ ఎక్క‌డా మాస్ హీరోయిజాన్ని చూపించాల‌నే ఉద్దేశంతో కాకుండా ప‌రిధి మేర‌కు న‌టిస్తూ వ‌చ్చాడు. కార్తికేయ‌లో ఎలాంటి ఓ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను చూశామో అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌న‌కు క‌నిపిస్తుంది. పార్ట్ వ‌న్ కంటే పార్ట్ 2లో యాక్ష‌న్ పార్ట్ కాస్త ఎక్కువే. అన్ని విధాలా తన న‌ట‌న‌తో నిఖిల్ న్యాయం చేశారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోకి సాయం చేసే పాత్ర‌లో క‌నిపించింది. త‌న పాత్ర‌లో ఒద్దికగా ఒదిగిపోయింది. కార్తిక్‌ని కాపాడే రెండు సీన్స్‌ అనుపమా క్యారెక్టర్‌ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. మంచి ఇంపాక్ట్ చూపించే రోల్‌లో గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీకృష్ణుడు గొప్ప‌తనాన్ని పొగుడుతూ ఆయ‌న చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. నెగటివ్ రోల్ చేసిన ఆదిత్య మీన‌న్‌.. హీరో త‌ల్లిగా చేసిన తుల‌సి, హీరో స్నేహితులు ప్ర‌వీణ్‌, స‌త్య‌, హీరో మేన‌మామ‌గా చేసిన శ్రీనివాస్ రెడ్డి ఇలా అంద‌రూ చ‌క్క‌గా వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. 

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ద‌ర్శ‌కుడు చందు మొండేటి కార్తికేయ1 త‌ర‌హా ఎగ్జయిట్మెంట్‌ను సీక్వెల్‌లో క్యారీ చేశారు. ఆ మూవీ కంటే ఈ సినిమాలో ఆయన తీసుకున్న పాయింట్‌కి వెయిట్ ఎక్కువ కావ‌టంతో సినిమాను గ్రాండియ‌ర్‌గా తెర‌కెక్కించారు. అలాగే చ‌క్క‌టి విజువ‌ల్ ఎఫెక్ట్స్ కుదిరాయి. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ చ‌క్క‌గా ఉంది.సెకండాఫ్ కాస్త సాగ‌దీత‌గా అనిపించ‌టం మిన‌హా సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

విశ్లేషణ:

‘కార్తికేయ’1 చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. దైవం, సైన్స్‌ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో మొత్తం సాదాసీదాగా సాగుతున్నప్పటికీ..  శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్‌ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది.  తర్వాత ఏం జరుగుతుంది అనే సెకండాఫ్‌లో మాత్రం క్యూరియాసిటీ పెంచింది..కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారనమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. థియేటర్లో మాత్రమే చుస్తే ఈ చిత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది.  

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :