ASBL Koncept Ambience
facebook whatsapp X

రిస్క్ కు రెడీ అయిన కార్తీ

రిస్క్ కు రెడీ అయిన కార్తీ

సెప్టెంబ‌ర్ 27న ఎన్నో అంచ‌నాల‌తో భారీ హైప్ తో ఎన్టీఆర్ దేవ‌ర‌1 రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి వారం ముందు త‌ర్వాత త‌మ సినిమాల రిలీజ్ లేకుండా నిర్మాత‌లు జాగ్ర‌త్త ప‌డుతుంటే హీరో కార్తీ మాత్రం దేవ‌రతో ఫేస్ టు ఫేస్ క్లాష్ కు రెడీ అవుతున్నాడు. కార్తీ కొత్త సినిమా మెయిజ‌గ‌న్ ని తెలుగులో స‌త్యం సుందరం అనే పేరుతో దేవ‌ర రిలీజ్ అవుతున్న రోజునే రిలీజ్ చేస్తున్నారు.

ఏషియ‌న్, సురేష్ డిస్ట్రిబ్యూష‌న్ కావ‌డంతో థియేట‌ర్ల‌కైతే ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. ఖైదీ సినిమా నుంచి కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్ప‌డింది. ఎంత మార్కెట్ ఉన్న‌ప్పటికీ దేవ‌ర‌తో పోటీ పడేంత సీన్ సత్యం సుంద‌రం సినిమాకు ఉందా అనేదే ప్ర‌శ్న‌. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా క‌చ్ఛితంగా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే ధీమాతో మేక‌ర్స్ ఉన్నారు.

సత్యం సుంద‌రంలో అర‌వింద్ స్వామి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. విలేజ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా క‌థ మొత్తం ఒకే రాత్రిలో జ‌రుగుతుంద‌ట‌. ఎన్నో షాకింగ్ ఎలిమెంట్స్ ఆడియ‌న్స్ ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయ‌ని చిత్ర యూనిట్ చెప్తోంది. ఎన్ని ఉన్నా దేవ‌ర క్రేజ్ కు ఈ సినిమా నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికీ మంచి టాక్ వ‌స్తే మాత్రం సినిమాకు కాస్త ఊర‌ట ల‌భిస్తుంది. త‌మిళ‌నాడు, కేర‌ళలో మాత్రం దేవ‌ర‌కు కార్తీ నుంచి పోటీ త‌ప్ప‌దు. మ‌రి దేవ‌ర ముందు స‌త్యం సుంద‌రం ఏ మేర‌కు నిల‌బ‌డ‌తాడో చూద్దాం.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :