ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సందడి..

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సందడి..

గతేడాది డిసెంబర్ తో పోల్చుకుంటే ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్ద సినిమాల రిలీజ్ లు తక్కువనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ అఖండ, పుష్ప వంటి బాక్ బస్టర్ సినిమాలు డిసెంబర్ లో రిలీజయ్యి సందడి చేసిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఏడాది పెద్ద సినిమాలేవీ విడుదలకి సిద్ధంగా లేవు.

చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు మాత్రమే ప్రస్తుతానికి సందడి చేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకున్నా , మంచి కాన్సెప్ట్ తో వచ్చే ఏ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చాలాసార్లు నిరూపితం అయ్యింది.

ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్దకి పలు సినిమాలు రాబోతున్నాయి. సత్యదేవ్ హీరోగా నటించిన " గుర్తుందా శీతాకాలం " అందులో ఒకటి. బేసిగ్గా ఇది కన్నడ మూవీ రీమేక్. మరి కొన్ని సినిమాలు " ప్రేమదేశం, ఆక్రోశం ,చెప్పాలనిఉంది, పంచతంత్రం ,ముఖచిత్రం, సివిల్ ఇంజనీర్ " కూడా ఈ వారం రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

ఈ సినిమాల్లో ప్రేమదేశం సినిమా కూడా కన్నడ మూవీ కి రీమేక్ గా రూపొందింది. ఇండస్ట్రీ లో ఈ రెండు సినిమాలకి సంబంధించిన బజ్ పాజిటివ్ గా ఉంది. ఇక సివిల్ ఇంజనీర్ విషయానికి వస్తే ఇది స్ట్రెయిట్ కన్నడ డబ్బింగ్ మూవీ. తెలుగు ప్రేక్షకులకి నచ్చే అంశాలతో ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

కేజిఎఫ్ తర్వాత కన్నడ చిత్రసీమ నుండి టాలీవుడ్ కి చాలా సినిమాలే రీమేక్ , డబ్బింగ్ రూపంలో వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం తమిళ సినిమాలనే ఎక్కువగా తెలుగులో రిలీజ్ చేసేవాళ్ళు. ప్రేక్షకులు సైతం కన్నడ మూవీస్ ని బానే ఆదరిస్తున్నారు. అందుకు రీసెంట్ గా రిలీజయ్యి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన కన్నడ సినిమాలే నిదర్శనం.

 

 

Tags :