MKOne TeluguTimes-Youtube-Channel

వెళ్తూ వెళ్తూ బిజేపిని ముంచేసి వెళ్తున్న కన్నా...?

వెళ్తూ వెళ్తూ బిజేపిని ముంచేసి వెళ్తున్న కన్నా...?

మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారేందుకు మార్గం సుగుమం చేసుకున్నట్టే కనపడుతుంది. పార్టీలో కీలక నేతగా ఉన్న కన్నా బయటకు వెళ్తే బిజెపి నష్టపోయే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఆయనతో పాటు ఎందరు బయటకు వెళ్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ తరుణంలో పెదకూరపాడు ఇంచార్జ్ గంధం కోటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేసారు.

ఆయనతో పాటుగా బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు కర్ణా సైదారావు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. సోము వ్యవహార శైలికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నాం అన్నారు ఆయన. వైసిపికి బిజెపిని తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. మోడీ ఆశయాలను గ్రామ గ్రామ ప్రచారం చేయాలనుకున్నాం అని మిత్రపక్షమైన జససేన అధినేత చిత్ర పటానికి పూల మాలలు వేసిన వ్యతిరేకించారు అని మండిపడ్డారు.

బిజెపిని భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు. సునీల్ ధియోదర్ , మధుకర్ కు పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలను చెప్పాం అన్నారు ఆయన. అయినా చర్యలు తీసుకోలేదు అని మండిపడ్డారు. సునీల్ ధియోధర్ మౌనం దేనికి సంకేతం అని నిలదీశారు. కన్నా వర్గమనే మాకు కార్యవర్గ సమావేశాలకు పిలవలేదు అని ఆరోపించారు. సోము ఆస్తులను పెంచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు.

పెదకూరపాడు బిజెపి ఇంఛార్జి గంధం కోటేశ్వరరావు మాట్లాడుతూ కన్నా వర్గమనే పేరుతో చాలామందిని సోము పక్కన పెట్టారు అన్నారు. 120 మంది నేతలు కార్యకర్తలు పార్టీ పదవులకు, పార్టీకీ రాజీనామా చేస్తున్నాం అని ప్రకటించారు. వీరు అందరూ కన్నా సమక్షంలో పార్టీ మారే అవకాశం కనపడుతుంది. ఎల్లుండి కన్నా జనసేన కండువా కప్పుకుంటున్న నేపధ్యంలో ఉభయగోదావరి జిల్లాల నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని టాక్.

 

 

Tags :