ASBL Koncept Ambience
facebook whatsapp X

రాష్ట్రపతికి బెంగాల్ మెడికోల లేఖ.. నిష్పాక్షిక సత్వర విచారణకు డిమాండ్

రాష్ట్రపతికి బెంగాల్ మెడికోల లేఖ.. నిష్పాక్షిక సత్వర విచారణకు డిమాండ్

బెంగాల్లో డాక్టర్ పైహత్యాచార ఘటనతర్వాత పరిస్థితులు సద్దుమణగడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి వైద్యులు విధులకు హాజరు కావడంలేదు. సీఎం మమత పిలిచినా వారు చర్చలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు.. ఇప్పుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ సాక్షాత్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు మెడికోలు.నేర తీవ్రత, దానిని కప్పిపుచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పని ప్రాంతాల్లో భయాలు నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యావద్దేశం నిష్పాక్షికమైన సత్వర విచారణను కోరుతోందని వైద్యులు తమ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.

ప్రజలు సమష్టిగా తమ భావోద్వేగాలను వెల్లడించేందుకు, బాధితురాలికి సంఘీభావం తెలిపేందుకు, న్యాయం కోరుతూ ఆగస్టు 15వ తేదీన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారని వివరించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అల్లరిమూక ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోకి చొరబడి క్యాంపస్‌పై దాడి చేసి ఎమర్జెన్సీ వార్డును ధ్వంసం చేశారని, ఘటన జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరిగిందని, ఇంత జరుగుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారన్నారు, గూండాల భయానికి వైద్యులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు పెట్టారని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.

''ఇలాంటి భయానక, నమ్మకం కోల్పోయిన, నిస్సహాయ స్థితిలో జూనియర్ వైద్యులు గత్యంతరం లేని పరిస్థితిలో ఆసుపత్రి ఆవరణలో పనులకు దూరంగా ఉన్నారు. ఇందుకు ప్రతిగా పౌరులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. అభయ క్లినిక్స్ పేరుతో పబ్లిక్ గ్రౌండ్స్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ వైద్యశిబిరాలను డబ్ల్యూబీజేడీఎఫ్ నిర్వహిస్తోంది. ఉచితంగా హెల్త్ కేర్ సేవలను కొనసాగిస్తోంది. న్యాయం-వైద్యం సమ్మెకు వెళ్లకూడదంటూ భారత ప్రధాన న్యాయమూర్తి మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని అవరోధాలు ఎదురైనా విధి నిర్వహణను వైద్యులు కొనసాగిస్తున్నారు'' అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు.

మరోవైపు...ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో దర్యాప్తునకు సంబంధించిన తాజా నివేదికను సెప్టెబర్ 17వ తేదీన తమకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నియమించిన మూడు సీఐఎస్ఎఫ్ కంపెనీలకు వసతి కల్పించాలని కూడా పశ్చిమబెంగాల్ హోం శాఖ సీనియర్ అధికారులు, సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :