నందమూరి మెగా అభిమానులకు లేటెస్ట్ అప్డేట్ : డిసెంబ‌ర్ 3న 'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ రిలీజ్

నందమూరి మెగా అభిమానులకు లేటెస్ట్ అప్డేట్ : డిసెంబ‌ర్ 3న 'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ రిలీజ్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ . వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ . అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ సినిమా విడుల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అధికారికంగా చెప్ప‌లేదు కానీ.. ఆర్ ఆర్ ఆర్  సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింద‌ట‌. సినిమా వ్య‌వ‌ధి 3 గంట‌ల 6 నిమిషాల‌ని కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టాలీవుడ్‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్‌కి చెందిన ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రో వైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ వంటి స్టార్స్ కూడా నటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో అప్‌డేట్‌ను తెలియ‌జేశారు జ‌క్క‌న్న‌. ఆర్ ఆర్ ఆర్  ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. దీంతో ఇటు మెగాభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్‌లోనే కాదు.. ఖండాంత‌రాలు దాటించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం కావ‌డంతో సినిమా కోసం ఎంటైర్ ఇండియా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. సినిమా డిసెంబ‌ర్ 3న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి త‌ర్వాత రోజు నుంచి ప్ర‌మోష‌న్స్‌ను మ‌రింత వేగవంతం చేయాల‌ని రాజ‌మౌళి అండ్ టీమ్ ఇప్ప‌టికే నిర్ణ‌యించుకుంది. చార్టెడ్ ఫ్లైట్‌లో ఇండియాలోని ప్ర‌ధాన న‌గరాల్లో ప‌ర్య‌టిస్తూ ఆర్ ఆర్ ఆర్  ను ప్ర‌మోట్ చేయాల‌ని ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ఆలియా, అజ‌య్ దేవ‌గ‌ణ్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌హా ఎంటైర్ యూనిట్ స‌భ్యులు నిర్ణ‌యించుకున్నారు.

భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ కూడా జ‌రుగుతుంది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూ.400 కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో నిర్మించిన చిత్ర‌మిది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు ప‌ది వేల థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉందని, ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్‌లో విడుద‌ల కాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. 1920 కాల‌పు బ్రిటీష్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌ల‌వ‌ని ఇద్ద‌రు యోధులు క‌లిసి బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కమౌళి రాజ‌మౌళి.

 

Tags :