Radha Spaces ASBL

తూలి పడిపోయిన జో బైడెన్

తూలి పడిపోయిన జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో  బైడెన్‌ కింద పడిపోయారు. కొలరాడోలోని అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీలో గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బైడెన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై ఆయన కాలు జారి తూలి పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత భద్రత  సిబ్బంది ఆయనను పైకి లేపారు. ఆ తరువాత ఆయన తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో బైడెన్‌కు  ఎటువంటి గాయాలూ కాలేదని వైట్‌హౌస్‌ ప్రతినిధి వెల్లడిరచారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బైడెన్‌ బాధపడుతున్నారని పలువరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :