MKOne Telugu Times Youtube Channel

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపవర్‌మెంట్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న ఎనిమిది మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇంటెల్లీసాఫ్ట్‌ కంపెనీలో వీరికి ఉద్యోగాలు లభించినట్టు, స్థానికంగా ఉంటూ పనిచేసే అవకాశం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ ఇన్‌ఛార్జి వేమూరి రవికుమార్‌,  టీడీపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ కో ఆర్డినేటర్‌ బుచ్చి రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :