MKOne TeluguTimes-Youtube-Channel

స్మిత్సోనియన్ మ్యూజియానికి జిల్ బైడెన్ దుస్తులు

స్మిత్సోనియన్ మ్యూజియానికి జిల్ బైడెన్ దుస్తులు

తన భర్త అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తాను ధరించిన దుస్తులను ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ స్మిత్సోనియాన్‌ మ్యూజియానికి బహుమతిగా స్వయంగా అందించారు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున నా జ్ఞాపకాల వాణిని ఆ దుస్తులు వినిపిస్తున్నాయి అని జిల్‌ అన్నారు. జో బైడెన్‌ 2021 జనవరి 20న దేశాధ్యక్షుడిగా పదవీ  స్వీకారం చేశారు. ఆ రోజు జిల్‌ బైడెన్‌ నీలి రంగు ట్వీడ్‌ దుస్తులు, కోటు ధరించారు. అదే రోజు రాత్రి వైట్‌హౌస్‌ కార్యక్రమంలో దంతపు రంగు ఉన్ని దుస్తులు, కశ్మీర్‌ కోటు ధరించారు. స్మిత్సోనియన్‌ మ్యూజియం అమెరికా అధ్యక్షులు ప్రమాణం చేసిన రోజున వారి భార్యలు ధరించిన దుస్తులను ప్రత్యేక విభాగంలో ప్రదర్శిస్తుంది.

 

 

Tags :